Hyderabad: టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త..! ఆ టికెట్లపై ధర తగ్గింపు.. పూర్తి వివరాలివే..

మహిళలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. వేసవి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే మహిళల ఆర్థికభారం తగ్గించేందుకు వారికి టీ-24 టికెట్‌ను రూ.80కే అందించాలని నిర్ణయించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌..

Hyderabad: టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త..! ఆ టికెట్లపై ధర తగ్గింపు.. పూర్తి వివరాలివే..
TSRTC T-Tickets
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 08, 2023 | 5:41 PM

మహిళలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. వేసవి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే మహిళల ఆర్థికభారం తగ్గించేందుకు వారికి టీ-24 టికెట్‌ను రూ.80కే అందించాలని నిర్ణయించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించే ఆ టికెట్‌ ధరను సాధారణ ప్రయాణికులకు రూ.90గా, సీనియర్‌ సిటిజన్లకు రూ.80గా ఇటీవల టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తగ్గించింది. తాజాగా మహిళా ప్రయాణికులకూ రూ.10 తగ్గించి రూ.80కే అందించాలని నిర్ణయించింది. ఈ కొత్త టి-24 టికెట్‌ ధర మంగళవారం నుంచి అందుబాటులోకి వస్తుంది. సిటీ పరిధిలో తిరిగే ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయి.

అనూహ్య స్పందన

ప్రయాణికుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అందుబాటులోకి  తెచ్చిన టి-24 టికెట్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనర్‌(ఐపీఎస్‌) తెలిపారు. ‘సిటీ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించే ఆ టికెట్‌ ధరను రూ.100 నుంచి రూ.90కి సంస్థ ఇటీవల తగ్గించింది. కొత్తగా సీనియర్‌ సిటీజన్లకు రూ.80కే ఆ టికెట్‌ను అందిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు టి-24 టికెట్లను ఎక్కువగా కొనుగోలు చేసి బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఆ ధర తగ్గింపు తర్వాత ప్రతి రోజు సగటున 40 వేల వరకు టి-24 టికెట్లు అమ్ముడవుతున్నాయి. గతంలో రోజుకి 25 వేలు మాత్రమే ఉండే ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది. మహిళా ప్రయాణికులకు మరింతగా దగ్గరఅయ్యేందుకు రూ.80కే టి-24 టికెట్‌ అందించాలని సంస్థ నిర్ణయించింద’ని వారు పేర్కొన్నారు.

మహిళలు, సీనియర్ సిటీజన్ల కోసం టి-6 టికెట్ ను ఇటీవల ప్రారంభించామని, రూ.50 కి ఆ టికెట్ ను కొనుగోలు చేస్తే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వారు ప్రయాణించవచ్చని చెప్పారు. అలాగే, కుటుంబ సభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం ఎఫ్-24 టికెట్ ను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. వీకెండ్స్‌, సెలవు రోజుల్లో రూ.300 చెల్లించి నలుగురు 24 గంటల పాటు ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీలో తీసుకువచ్చిన టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను కొనుగోలు చేసి.. క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తోన్న టీఎస్ఆర్టీసీని ప్రజలు ఆదరించాలని కోరారు. సంస్థ ఏ కార్యక్రమం తీసుకువచ్చిన ప్రజలు ప్రోత్సహిస్తున్నారని, వారి ఆదరణ మరువలేనిదన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

ఏఆర్ రెహమాన్ సీరియస్ వార్నింగ్..
ఏఆర్ రెహమాన్ సీరియస్ వార్నింగ్..
BSNL, Jioలో 70 వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ఏది చౌకైనది..!
BSNL, Jioలో 70 వ్యాలిడిటీ ప్లాన్‌ గురించి తెలుసా? ఏది చౌకైనది..!
అరటిపండు, యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?తప్పక తెలుసుకోండి
అరటిపండు, యాపిల్ కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?తప్పక తెలుసుకోండి
కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..
ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..
మెగా వేలంలో రికార్డ్ ప్రైజ్ పొందే ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు
మెగా వేలంలో రికార్డ్ ప్రైజ్ పొందే ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు
పోస్టాఫీసులు అద్భుతమైన స్కీమ్‌.. నెలకు రూ.20,500
పోస్టాఫీసులు అద్భుతమైన స్కీమ్‌.. నెలకు రూ.20,500
సిద్ధార్థ్‌ హిట్ కొట్టేలా ఉన్నాడే.. ఆసక్తికరంగా 'మిస్‌ యూ' ట్రైలర
సిద్ధార్థ్‌ హిట్ కొట్టేలా ఉన్నాడే.. ఆసక్తికరంగా 'మిస్‌ యూ' ట్రైలర
డస్ట్‌ అలర్జీ బాధిస్తోందా..? ఈ ఆయుర్వేద ఇంటి చిట్కాలు మీకోసం..!
డస్ట్‌ అలర్జీ బాధిస్తోందా..? ఈ ఆయుర్వేద ఇంటి చిట్కాలు మీకోసం..!
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!