AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Test Rankings : ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. రెండు స్థానాలు ఎగబాకిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్

ICC Test Rankings : ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో హ్యారీ బ్రూక్ ప్రపంచ నంబర్-1 బ్యాటర్‌గా అవతరించగా, శుభ్‌మన్ గిల్ రెండు స్థానాలు ఎగబాకి టాప్-10లోకి చేరాడు. బుమ్రా, జడేజా తమ అగ్రస్థానాలను నిలబెట్టుకోగా, వాషింగ్టన్ సుందర్ కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్ సాధించాడు.

ICC Test Rankings : ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. రెండు స్థానాలు ఎగబాకిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్
Shubman Gill
Rakesh
|

Updated on: Jun 10, 2026 | 4:47 PM

Share

ICC Test Rankings : ఐసీసీ తాజాగా ప్రకటించిన పురుషుల టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంగ్లాండ్‌కు చెందిన స్టార్ బ్యాటర్ జో రూట్ తన నంబర్-1 స్థానాన్ని కోల్పోయాడు. అతని స్థానంలో ఇంగ్లాండ్‌కే చెందిన మరో యంగ్ సెన్సేషన్ హ్యారీ బ్రూక్ ప్రపంచ నంబర్-1 టెస్ట్ బ్యాటర్‌గా అవతరించాడు. మరోవైపు, అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన భారత సరికొత్త సారథి శుభ్‌మన్ గిల్ ఈ ర్యాంకింగ్స్‌లో సుదీర్ఘ లాంగ్ జంప్ చేశాడు. లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో జో రూట్ ఘోరంగా విఫలమయ్యాడు. అతను మొదటి ఇన్నింగ్స్‌లో 1 రన్, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈ పేలవ ప్రదర్శన కారణంగా రూట్ 851 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానం నుంచి ఏకంగా మూడో స్థానానికి పడిపోయాడు. అయితే, ఇదే మ్యాచ్‌లోని తొలి ఇన్నింగ్స్‌లో 56 పరుగులు చేసిన హ్యారీ బ్రూక్ 869 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అలాగే ఆస్ట్రేలియా పవర్ హిట్టర్ ట్రావిస్ హెడ్ ఒక స్థానం మెరుగుపరుచుకుని మూడో స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకున్నాడు.

టాప్-10 లో దూసుకుపోతున్న శుభ్‌మన్ గిల్

న్యూ చండీగఢ్ (ముల్లాంపూర్) వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 126 పరుగులతో అద్భుతమైన సెంచరీ బాదాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఒక ఇన్నింగ్స్, 300 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ సెంచరీ ప్రయోజనంతో గిల్ ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి 743 రేటింగ్ పాయింట్లతో 8వ ర్యాంకుకు చేరుకున్నాడు. దీనితో ప్రస్తుతం టెస్ట్ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక ర్యాంక్ ఉన్న బ్యాటర్‌గా గిల్ నిలిచాడు. ఇప్పటివరకు టాప్‌లో ఉన్న యశస్వి జైస్వాల్ ఒక స్థానం కిందకు పడిపోయి 9వ స్థానానికి పరిమితమయ్యాడు.

నెంబర్-1 స్థానాల్లోనే బుమ్రా, రవీంద్ర జడేజా

భారత స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో, అలాగే రవీంద్ర జడేజా టెస్ట్ ఆల్‌రౌండర్ల జాబితాలో తమ నంబర్-1 స్థానాలను విజయవంతంగా కాపాడుకున్నారు. అఫ్గానిస్తాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో వీరిద్దరికీ విశ్రాంతినిచ్చినప్పటికీ, ర్యాంకింగ్స్‌లో వీరి స్థానాలకు ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. అయితే, బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజాకు కాస్త నిరాశ ఎదురైంది. అతను బౌలింగ్‌లో మూడు స్థానాలు కిందకు జారిపోయి 17వ ర్యాంకుకు పడిపోయాడు.

కెరీర్ బెస్ట్ రేటింగ్‌తో వాషింగ్టన్ సుందర్ రికార్డు

టీమిండియా యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఐసీసీ టెస్ట్ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. అఫ్గాన్ మ్యాచ్‌లో అదరగొట్టిన సుందర్, రెండు స్థానాలు పైకి ఎగబాకి 244 రేటింగ్ పాయింట్లతో 9వ స్థానానికి చేరుకున్నాడు. తద్వారా ఐసీసీ టాప్-10 ఆల్‌రౌండర్ల జాబితాలో అధికారికంగా ఎంట్రీ ఇచ్చాడు. సుందర్ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ టెస్ట్ ఆల్‌రౌండర్ రేటింగ్ కావడం విశేషం. మొత్తానికి ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ భారత క్రికెట్ అభిమానులకు సరికొత్త జోష్‌ను ఇచ్చాయనే చెప్పాలి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శాంసంగ్​ గెలాక్సీ ట్యాబ్ S12 అల్ట్రా.. స్పెషాలిటీస్ ఇవే
శాంసంగ్​ గెలాక్సీ ట్యాబ్ S12 అల్ట్రా.. స్పెషాలిటీస్ ఇవే
ప్రేమిస్తే సినిమాలో తెగ నవ్వించిన ఈ చిన్నోడు గుర్తున్నాడా..?
ప్రేమిస్తే సినిమాలో తెగ నవ్వించిన ఈ చిన్నోడు గుర్తున్నాడా..?
కారు సీటు బెల్ట్‌పై 'బ్లాక్​ బటన్' గమనించారా? ఇది ఎందుకు ఉంటుంది?
కారు సీటు బెల్ట్‌పై 'బ్లాక్​ బటన్' గమనించారా? ఇది ఎందుకు ఉంటుంది?
త్వరలో మార్కెట్లోకి వివో Y6k స్మార్ట్‌ఫోన్.. వివరాలివే
త్వరలో మార్కెట్లోకి వివో Y6k స్మార్ట్‌ఫోన్.. వివరాలివే
గర్భాశయం లేకుండా పుట్టింది.. అక్క కానుకతో తల్లి కాబోతోంది!
గర్భాశయం లేకుండా పుట్టింది.. అక్క కానుకతో తల్లి కాబోతోంది!
బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.!
బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.!
తక్కువ బడ్జెట్‌కే మార్కెట్‌లో నోకియా 2660 ఫ్లిప్‌ 4G.. ఎంతంటే
తక్కువ బడ్జెట్‌కే మార్కెట్‌లో నోకియా 2660 ఫ్లిప్‌ 4G.. ఎంతంటే
ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తే కరెంట్ బిల్లు తగ్గుతుందా..? అసలు నిజాలు..
ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తే కరెంట్ బిల్లు తగ్గుతుందా..? అసలు నిజాలు..
WiFi రూటర్‌పై కాయిన్ పెడితే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందా?
WiFi రూటర్‌పై కాయిన్ పెడితే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందా?
విడాకుల రూమర్స్ పై సింగర్ హేమచంద్ర క్లారిటీ..
విడాకుల రూమర్స్ పై సింగర్ హేమచంద్ర క్లారిటీ..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర