AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banking Rules: బ్యాంక్ చెక్కు రాస్తున్నారా..? జాగ్రత్త బాసూ.. ఈ చిన్న తప్పు చేస్తే రెండేళ్లు జైల్లో ఉండాల్సిందే..

చెక్కు బౌన్స్ అయితే జైలుశిక్ష పడుతుందా? అనే డౌన్ చాలామందికి ఉంటుంది. అయితే జౌలుశిక్ష విధించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. తొలుత జరిమానా విధిస్తారు. ఎక్కవసార్లు చెక్కు బౌన్స్ అయితే కఠిన చర్యలు ఉంటాయి. ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందంటే..

Banking Rules: బ్యాంక్ చెక్కు రాస్తున్నారా..?  జాగ్రత్త బాసూ.. ఈ చిన్న తప్పు చేస్తే రెండేళ్లు జైల్లో ఉండాల్సిందే..
Cheque Bounce
Venkatrao Lella
|

Updated on: Jun 10, 2026 | 4:57 PM

Share

ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. చేతిలో మొబైల్ ద్వారానే ఎక్కడికి వెళ్లాల్సిన పని లేకుండా అన్నీ పనులు పూర్తవుతున్నాయి. ఒకప్పుడు నగుద డిపాజిట్ చేయాలన్నా లేదా విత్ డ్రా చేయాలన్నా బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. గంటలపాటు క్యూలైన్లలో నిల్చోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఉన్న సాంకేతికత వల్ల మొబైల్ ద్వారానే సెకన్ల వ్యవధిలోనే నగదు లావాదేవీలు నిర్వహించే వెసులుబాటు లభించింది. యూపీఐ ద్వారా బ్యాంక్ అకౌంట్ నుంచి సెకన్లలోనే నగదు ఇతరులకు పంపడం లేదా మనం అందుకోవడం లాంటివి చేయవచ్చు. అయితే ఇన్ని సదుపాయాలు ఉన్నా ఇప్పటికీ డబ్బు లావాదేవీల్లో చెక్కులను చాలామంది వినియోగిస్తూనే ఉన్నారు. అయితే చెక్కులో తప్పులు ఉండటం వల్ల క్లియర్ చేసేందుకు బ్యాంక్ నిరాకరిస్తుంది. అప్పుడు చెక్ బౌన్స్ అవుతుంది.

జైలుశిక్ష పడుతుందా..?

అయితే చెక్కు బౌన్స్ కావడం వల్ల కేసు నమోదైందనే వార్తలు మీరు వినే ఉంటారు. చెక్కు బౌన్స్ అయితే అనేక చట్టపరమైన చిక్కులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇండియన్ 1881 నాటి నెగోషియబుల్ ఇన్స్టుమెంట్స్ మాక్ట్‌లోని సెక్షన్ 138 ప్రకారం ఉద్దేశపూర్వంగా లేదా నిర్లక్ష్యం కారణంగా బౌన్స్ అయ్యే చెక్కును జారీ చేస్తే నేరమని చెప్పవచ్చు. ఈ నేరానికి గాను కేసు నమోదు చేయడంతో పాటు గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష పడవచ్చు. అలాగే జారీ చేసిన చెక్ మొత్తానికి సరిపడ రెట్టింపు జరిమానా కట్టాల్సి రావొచ్చు. అయితే జైలు శిక్ష అనేది వెంటనే విధించరు. ముందుగా లీగల్ నోటీసులు జారీ చేస్తారు. నోటీసు అందిన 15 రోజుల్లోగా చెల్లింపు చేయాల్సి ఉంటుంది. లేకపోతే కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేయవచ్చు. అనంతరం కోర్టులు హాజరుకావాల్సి ఉంటుంది. పదేపదే చెక్కులు బౌన్స్ చేసేవారిపై కోర్టు కఠిన వైఖరి అవలంబించవచ్చు. ఇలాంటి సమయాల్లో జైలుశిక్ష కూడా విధించే అవకాశముంటుంది. అంతేకాకుండా చెక్ బౌన్స్ అయితే జారీ చేసిన వ్యక్తితో పాటు తీసుకున్న వ్యక్తి బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.150 నుంచి రూ.750 వరకు జరిమానాను బ్యాంకులు వసూలు చేస్తాయి. దీంతో చెక్ బౌన్స్ అయితే చట్టపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది.

చెక్ బౌన్స్ ఎప్పుడు అవుతుంది..?

-చెక్ జారీ చేసిన వ్యక్తి అకౌంట్లో డబ్బులు లేకపోవడం

-సంతకం సరిగ్గా లేకపోవడం, బ్యాంక్ రికార్డులతో సరిపోలకపోవడం

-తేదీలలో తప్పు ఉండటం

-చెక్ బౌన్స్ కాకుండా ఉండాలంటే అకౌంట్లో సరిపడ బ్యాలెన్స్ ఉండాలి

-సంతకం, తేదీలు అన్నీ కరెక్ట్‌గా ఉండేలా చేసుకోవాలి

Follow Us