AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమరావతికి మోదీ మెగా గిఫ్ట్.. రూ. 2,534 కోట్ల రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్!

ప్రధానిగా 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని రికార్డు సృష్టించారు మోదీ. ఇదే రోజు అమరావతిపై మరోసారి వరాల జల్లు కురిపించారు. 2 వేల 500 కోట్ల వ్యయంతో అమరావతిలో చేపట్టిన రెండు కీలక ప్రాజెక్టులకు మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో ఒకటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయ కాంప్లెక్స్ నిర్మాణం కాగా మరొకటి కేంద్ర ఉద్యోగుల గృహ సముదాయ నిర్మాణం.

అమరావతికి మోదీ మెగా గిఫ్ట్.. రూ. 2,534 కోట్ల రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్!
Pm Modi Cabinet Approves
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Jun 10, 2026 | 4:52 PM

Share

ప్రధానిగా 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని రికార్డు సృష్టించారు మోదీ. ఇదే రోజు అమరావతిపై మరోసారి వరాల జల్లు కురిపించారు. 2 వేల 500 కోట్ల వ్యయంతో అమరావతిలో చేపట్టిన రెండు కీలక ప్రాజెక్టులకు మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో ఒకటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయ కాంప్లెక్స్ నిర్మాణం కాగా మరొకటి కేంద్ర ఉద్యోగుల గృహ సముదాయ నిర్మాణం.

అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన నేపథ్యంలో, అక్కడ రూ. 2,534 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానిగా 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో మోదీ అమరావతిపై ఈ వరాల జల్లు కురిపించడం విశేషం.

ప్రస్తుతం విజయవాడ, గుంటూరు పరిసరాల్లో ముక్కలుముక్కలుగా సాగుతున్న కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చేందుకు, ఉద్యోగుల వసతి కల్పించేందుకు ఈ నిధులు కేటాయించారు. రాబోయే నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టులు పూర్తి కానున్నాయి. కేంద్ర కేబినెట్ రెండు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.

అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట కొలువుదీరేలా ‘సెంట్రల్‌ సెక్రటేరియట్‌’ నిర్మాణానికి ఆమోదం తెలిపింది మోదీ ప్రభుత్వం. ఈ సెక్రటేరియట్ నిర్మాణానికి 1299 కోట్ల రూపాయలను కేంద్రం ఖర్చు చేస్తోంది. సుమారు 5.53 ఎకరాల విస్తీర్ణంలో 23 లక్షల 25 వేల చదరపు అడుగుల బిల్డప్‌ ఏరియాలో సెక్రటేరియన్ నిర్మాణం చేపడతారు. 8 వేలమంది ఉద్యోగులు పనిచేసేందుకు అవసరమైన సదుపాయాలు ఇందులో ఉంటాయి. 1800 కార్లు పార్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తారు. స్మార్ట్ సిటీ రూపకల్పనలో భాగంగా ఆధునిక సౌకర్యాలతో నిర్మించే ఈ కాంప్లెక్స్ ద్వారా రాష్ట్రంలో కేంద్ర నిధులు, కార్యాలయాల సమన్వయం మరింత సులభతరం కానుందని అధికారులు తెలిపారు. ఈ కాంప్లెక్స్ నిర్మాణంతో 7.5 లక్షల పని దినాల ఉపాధి లభిస్తుంది.

అలాగే, అమరావతిలో పనిచేసే కేంద్ర ఉద్యోగులకు గృహ సముదాయం నిర్మించేందుకూ ఆమోదముద్ర వేసింది కేంద్ర కేబినెట్. 1235 కోట్ల రూపాయల వ్యయంతో మల్టీస్టోరేజ్‌ నివాసాలను నిర్మిస్తారు. ప్రస్తుతం అమరావతిలో ఉద్యోగులకు తగిన అద్దె ఇళ్లు లేకపోవడంతో విజయవాడ, గుంటూరుల నుండి రోజుకు 30-50 కిమీ ప్రయాణించాల్సి వస్తోంది. ఈ ఇబ్బందిని తప్పించేందుకు కార్యాలయాల సమీపంలోనే క్వార్టర్స్ నిర్మిస్తారు. మొత్తం 17 ఎకరాల విస్తీర్ణంలో, 31.30 లక్షల చదరపు అడుగుల నిర్మాణం చేపట్టనున్నారు. టైప్-2 నుండి టైప్-6 కేటగిరీల వరకు మొత్తం 1,504 అత్యాధునిక మల్టీస్టోరేజ్ ఫ్లాట్లు నిర్మిస్తారు.

ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి కావడంతో రాజధాని ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ పరిపాలన వేగవంతం అవ్వడమే కాకుండా, వేలాది మంది ఉద్యోగులు వారి కుటుంబాలతో ఇక్కడే స్థిరపడటం వల్ల అమరావతిలో ఆర్థిక, సామాజిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి. ఏపీ రాజధాని అభివృద్ధిలో ఇది కీలక మైలురాయిగా నిలవనుంది. కేంద్రం ఆధీనంలో చేపట్టిన ఈ రెండు భారీ నిర్మాణాలు నాలుగేళ్లలో పూర్తవుతాయని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాజధానిలో పరిపాలనా కార్యకలాపాలు మరింత వేగవంతం కావడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలు కూడా ఒకేచోట నివాసం ఉండడం వల్ల అమరావతికి రాకపోకలు కూడా పెరుగుతాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
హిమాలయాల్లో మెఘా ఇంజినీరింగ్ మరో సంచలనం..!
హిమాలయాల్లో మెఘా ఇంజినీరింగ్ మరో సంచలనం..!
డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..!
డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..!
వాట్సాప్‌లో బెస్ట్ ఫీచర్.. రెండు ఫోన్‌ కెమెరాలు ఒకేసారి..!
వాట్సాప్‌లో బెస్ట్ ఫీచర్.. రెండు ఫోన్‌ కెమెరాలు ఒకేసారి..!
ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడని ఆహారాలు ఏంటో తెలుసా..?
ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడని ఆహారాలు ఏంటో తెలుసా..?
బిల్లుపై పోరుకు కాంగ్రెస్ రెడీ.. మధ్యలో ట్విస్ట్ ఇచ్చిన మిత్రులు!
బిల్లుపై పోరుకు కాంగ్రెస్ రెడీ.. మధ్యలో ట్విస్ట్ ఇచ్చిన మిత్రులు!
కార్తీక శనివారం వేంకటేశ్వర స్వామి పూజ.. ఇంట్లోనే ఇలా పూజిస్తే..
కార్తీక శనివారం వేంకటేశ్వర స్వామి పూజ.. ఇంట్లోనే ఇలా పూజిస్తే..
బంగారంపై రుణం తీసుకున్న వారికి బ్యాంకుల నుంచి నోటీసులు.. ఎందుకంటే
బంగారంపై రుణం తీసుకున్న వారికి బ్యాంకుల నుంచి నోటీసులు.. ఎందుకంటే
జియో, ఎయిర్‌టెల్‌కు ట్రాయ్ బిగ్ షాక్.. ఇకపై లెక్క మారాల్సిందేనా ?
జియో, ఎయిర్‌టెల్‌కు ట్రాయ్ బిగ్ షాక్.. ఇకపై లెక్క మారాల్సిందేనా ?
Hyundai Ioniq Pతో Tata Nexon మార్కెట్​ తగ్గుతుందా?
Hyundai Ioniq Pతో Tata Nexon మార్కెట్​ తగ్గుతుందా?
జనవరి నుంచే జలగండం..? జలాశయాల్లో జీరో లెవల్స్.. హైదరాబాద్ అంతటా..
జనవరి నుంచే జలగండం..? జలాశయాల్లో జీరో లెవల్స్.. హైదరాబాద్ అంతటా..