- Telugu News Photo Gallery Taking Too Much of Cinnamon will leads you to face these health problems, check to know full details
Health Tips: దాల్చిన చెక్కతో ఎన్నో ప్రయోజనాలు.. పరిమితికి దాటితే ఎన్ని సమస్యలో కూడా తెలుసుకోండి మరి..
Health Tips: వంట గదిలో ఉండే మసాలా దినుసులు మన ఆరోగ్యాన్ని కాపాడడంలో నిస్పందేహంగా ఉపయోగపతాయి. అటువంటివాటిలో దాల్చిన చెక్క కూడా ఒకటి. అయితే ఏదైనా పరిమితిని దాటితే విషంగా మారినట్లే దాల్చిన చెక్క కూడా మోతాదుకు మించితే ఆరోగ్యానికి హానికరం. ఈ క్రమంలో దాల్చిన చెక్కను అధికంగా తీసుకుంటే కలిగే సమస్యలేమిటో ఇప్పుడు చూద్దాం..
Updated on: May 07, 2023 | 4:04 PM

Health Tips: వంట గదిలో ఉండే మసాలా దినుసులు మన ఆరోగ్యాన్ని కాపాడడంలో నిస్పందేహంగా ఉపయోగపతాయి. అటువంటివాటిలో దాల్చిన చెక్క కూడా ఒకటి. అయితే ఏదైనా పరిమితిని దాటితే విషంగా మారినట్లే దాల్చిన చెక్క కూడా మోతాదుకు మించితే ఆరోగ్యానికి హానికరం.

మోతాదుకు మించి దాల్చిన చెక్కను తీసుకుంటే జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా కడుపులో మంట, అల్సర్‌లకు దారి తీసే ప్రమాదం ఉంటుంది.

దాల్చిన చెక్కను అతిగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అమాంతం పడిపోయే ప్రమాదం ఉంది. అలాగే రక్తపోటు కూడా తీవ్రంగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఫలితంగా మీకు మైకం, మత్తుగా అనిపిస్తుంది.

గ్యాస్ సమస్య, శ్వాస కోశ సమస్యలతో బాధపడేవారు దాల్చిన చెక్కను అతిగా వినియోగించడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

పరిమితి దాటితే దాల్చిన చెక్క కాలేయం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. మోతాదుకు మించినప్పుడు ఇందులోని కొమారిన్ లివర్‌పై ప్రతికూల ప్రభావం చూపి దాని పనితీరును కూడా నెమ్మదింపజేస్తుంది.

పైన పేర్కొన్న విషయాలు ప్రాథమిక సమాచారం ఆధారంగా అందించడం జరిగింది. దీనినే ప్రమాణికంగా భావించి ఒక నిర్ణయానికి రావాలని సూచిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా ముందుగా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.





























