- Telugu News Photo Gallery Had a breakup? Here are the things that you should never do for the sake of your Happiness
బ్రేకప్ తర్వాత కూడా సంతోషంగా ఉండాలంటే.. ఎన్నటికీ చేయకూడని తప్పులివే..
మానవ జీవితంలో అతి ముఖ్యమైన విషయాల్లో రిలేషన్ కూడా ఒకటి. ఏదైనా అనివార్య కారణాల వల్ల బ్రేక్ అప్ అయిపోతే కొంత మంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అయితే అలా చేయడం మంచిది కానే కాదు. ముఖ్యంగా బ్రేక ఆప్ తర్వాత ఈ పనులను అసలు చేయవద్దు. అవేమిటంటే..
Updated on: May 07, 2023 | 3:45 PM

వేధింపులు: బ్రేకప్ తర్వాత మీ నుంచి విడిపోయినవారిపై పట్టలేనంత కోపం రావడం సహజం. అయితే ఆ కోపంలో వారిపై పగ తీర్చుకోవాలనే కోరికతో వారిని వేధించడం మీకు ఏ మాత్రం కూడా మంచి పని కాదు. అలా చేయడం వల్ల రానున్న కాలంలో మీరు మానసిక వేదనకు గురవుతారని గుర్తు పెట్టుకోండి.

తప్పుగా మాట్లాడడం: కోపంలో చాలా మంది మాటలు జారుతుంటారు. ఇలా చేయడం వల్ల మీ మనసులోని భారం తాత్కాలికంగా దూరమవ్వొచ్చు. కానీ ఆ తర్వాత మీరే బాధపడవలసి వస్తుంది. కాబట్టి తప్పుగా మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిచండి.

ఒంటరితనం:చాలా మంది బ్రేకప్ తర్వాత ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతుంటారు. అయితే ఇది అస్సలు మంచిది కాదు. ఇలా ఒంటరిగా ఉన్న కారణంగానే చాలా మందిలో ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటాయి.

ఆల్కహాల్: చాలా మంది తమ బ్రేకప్ బాధల నుంచి బయటపడేందుకు ఆల్కహాల్‌ని ఆశ్రయిస్తుంటారు. అయితే ఇది మీకు, మీ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.

నిరాశ: ఇంకా బ్రేకప్ జరిగిన తర్వాత చాలా మంది నిరాశ పడిపోతుంటారు. మరి కొందరైతే ఇక జీవితం ముగిసిపోయిందనే భావనలో జీవిస్తుంటారు. కానీ అలా ఎప్పటికీ అనకోకండి. మిమ్మల్ని వదిలి వెళ్లిపోయినవారి కోసం మీరు బాధపడడం సరైనా నిర్ణయం కానే కాదని గుర్తు పెట్టుకోండి.

అన్ని బాధలను వదిలేసి సంతోషంగా జీవించండి. మిమ్మల్ని వదిలేసి వెళ్లాలనే ఆలోచన ఉన్నవారు ఈ రోజు కాకపోయినా మరో రోజు అయినా వదిలేస్తారు. వాళ్లతో ఇంకా దగ్గరై.. అప్పుడెప్పుడో బాధపడే కంటే ముందుగానే వాళ్ల నిజ స్వభావం చూపించారని సంతోషించండి. ఒంటరిగా వచ్చాం.. ఒంటరిగా పోతాం.. మధ్యలో మిమ్మల్ని కాదనుకుని వెళ్లిపోయినవారి కోసం మీ సమయం ఎందుకు వృథా చేసుకోవడం..? ఓ సారి ఆలోచించండి..





























