AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Odisha: రాష్ట్రపతి ముర్ము ఒడిశా పర్యటన వివాదం.. ఫొటోలు తీసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన ఫార్మసిస్ట్‌పై సస్పెన్షన్‌ వేటు!

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశా పర్యటనలో విద్యుత్‌ వైఫల్యంపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్రపతి ముర్ము హెలికాప్టర్‌తో ఫోటోలు దిగి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసినందుకు ఓ ఫార్మసిస్ట్‌ సస్పెండ్ అయ్యాడు. ముర్ము ఒడిశా పర్యటనలో భాగంగా రెండో రోజు (మే 5) జిల్లాలోని..

Odisha: రాష్ట్రపతి ముర్ము ఒడిశా పర్యటన వివాదం.. ఫొటోలు తీసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన ఫార్మసిస్ట్‌పై సస్పెన్షన్‌ వేటు!
Photos With Droupadi Murmu Helicopter
Srilakshmi C
|

Updated on: May 08, 2023 | 4:58 PM

Share

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశా పర్యటనలో విద్యుత్‌ వైఫల్యంపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్రపతి ముర్ము హెలికాప్టర్‌తో ఫోటోలు దిగి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసినందుకు ఓ ఫార్మసిస్ట్‌ సస్పెండ్ అయ్యాడు. ముర్ము ఒడిశా పర్యటనలో భాగంగా రెండో రోజు (మే 5) జిల్లాలోని సిమిలిపాల్‌ నేషనల్‌ పార్క్‌ సందర్శన సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. హెలికాఫ్టర్‌ సమీపంలో మొబైల్ ఫోన్ కెమెరాతో ఫొటోలు తీసి, వాటిని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసినందుకు ఫార్మసిస్ట్ జశోబంత్ బెహెరా అనే ఫార్మసిస్ట్‌ను CDMO డాక్టర్ రూపభాను మిశ్రా సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

బెహెరాను రాష్ట్రపతి వైద్య బృందంలో మే 5న నియమించారు. తాను కేవలం సరదా కోసమే రాష్ట్రపతి ముర్ము ఫొటోలు తీసి, ఫేస్‌బుక్‌లో పోస్టు చేశానని, దీని వెనుక వేరే ఉద్దేశ్యం ఏమీలేదని బెహెరా అధికారులకు తెలిపాడు. ఇందుకోసం హెలికాప్టర్ భద్రత సిబ్బంది నుంచి తాను ముందుగా అనుమతి కూడా తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. రాష్ట్రపతి లాంటి గొప్ప వ్యక్తి తమ జిల్లాకు సందర్శిస్తున్న నేపథ్యంలో తాను హెలిప్యాడ్‌లో విధులు నిర్వహిస్తున్నందుకు ఆ ఫొటోలను జ్ఞాపకంగా ఉంచుకోవాలనుకున్నానని అన్నాడు. అందుకే ఈ హెలికాప్టర్ వద్ద తన రాష్ట్రపతి ముర్ము ఫొటోలు తీశానన్నాడు. తన ఫేస్‌బుక్ ఖాతా నుంచి ఫొటోలను డిలీట్ చేశానని అధికారులకు తెలిపాడు.

కాగా ఒడిశాలోని బరిపాడలో శనివారం నాడు శ్రీరామచంద్ర భంజా డియో యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ముర్ము ప్రసంగిస్తున్న సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించిన అంశం రాజకీయ మలుపు తిరిగింది. దాదాపు తొమ్మిది నిమిషాల పాటు ముర్ము చీకట్లో ఉంచినందుకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. మయూర్‌భంజ్‌ జిల్లా కలెక్టర్‌, యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌లను తక్షణమే బర్తరఫ్‌ చేయాలని కేంద్ర జలశక్తి, గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బిశేశ్వర్‌ తుడు డిమాండ్‌ చేశారు. రాష్ట్రపతిని కించపరిచేందుకే ఇలా చేశారని, దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రపతి కార్యక్రమంలో విద్యుత్ వైఫల్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోకుంటే బంద్ నిర్వహిస్తామన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.