‘నా తప్పు లేకుండా ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు’.. రూమర్స్‌పై నటి శోభితా ధూళిపాళ్ల క్లారిటీ
సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు అభిమానులు అమితాశక్తి కనబరుస్తుంటారు. ఇద్దరు సెలబ్రెట్రీలు కలిసి బయట ఎక్కడైనా కనిపిస్తే అది స్నేహమో.. లేదా లవ్ ట్రాక్ ఏదైనా నడుస్తుందా అంటూ ఆరా తీస్తుంటారు. ఈ క్రమంలో సెలబ్రెటీల ప్రమేయం లేకుండానే ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతుంటాయి..
Updated on: May 08, 2023 | 6:10 PM

సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు అభిమానులు అమితాశక్తి కనబరుస్తుంటారు. ఇద్దరు సెలబ్రెట్రీలు కలిసి బయట ఎక్కడైనా కనిపిస్తే అది స్నేహమో.. లేదా లవ్ ట్రాక్ ఏదైనా నడుస్తుందా అంటూ ఆరా తీస్తుంటారు. ఈ క్రమంలో సెలబ్రెటీల ప్రమేయం లేకుండానే ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతుంటాయి.

నటి శోభితా ధూళిపాళ్ల - నాగచైతన్య డేటింగ్ రూమర్స్ తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ విషయంపై వీరిద్దరూ ఇప్పటి వరకూ స్పందించకపోవడంతో ఈ లవ్ బర్డ్స్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి.. తాజాగా ఓ కార్యక్రమంలో దీనిపై నటి శోభితా ధూళిపాళ్ల స్పందిస్తూ..

'అదృష్టవశాత్తు ఇప్పటివరకూ నేను మంచి సినిమాల్లో నటించాను. మణిరత్నం డైరెక్షన్‌లో ఇటీవలే పొన్నియన్ సెల్వన్ సినిమా చేశాను. ఇందులో ఏఆర్రెహమాన్ కంపోజ్ చేసిన 4 పాటలకు డ్యాన్స్ చేసే అద్భుతమైన అవకాశం దొరికింది. నా వరకు అదొక అద్భుత అనుభవం. ఇంత మంచి మధుర జ్ఞాపకాలు ఉన్నప్పుడు ఎవరో ఏదో అంటున్నారని దాన్ని పట్టించుకోవల్సిన పని లేదు'.

'నాపై వచ్చే రూమర్‌తో నాకసలు సంబంధమే లేనప్పుడు, నా తప్పు లేకుండా జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరో ఏదో నోటికొచ్చినట్లు మాట్లాడితే దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. వాటిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. వేరే వాటి గురించి ఆలోచించాల్సిన పని లేదు. నా పని నేను చేసుకుంటూ పోతాను' శోభిత చెప్పుకొచ్చారు.

ఇక సినిమాల విషయానికి వస్తే తాజాగా శోభిత పొన్నియన్ సెల్వన్ -2 నటించి మంచి విజయం అందుకున్నారు. టాలీవుడ్‌లోకి ‘గూఢచారి’తో అరంగెట్రం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో ఈ బ్యూటీ బిజీగా ఉంది.





























