- Telugu News Photo Gallery Cinema photos Are you a fan of Korean series, List of 5 world famous Korean dramas
Korean Dramas: మీరు కొరియన్స్ సిరీస్ ప్రియులా… ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ 5 కొరియన్ నాటకాలు లిస్ట్
ప్రపంచ వ్యాప్తంగా కొరియన్ డ్రామాలు చాలా ఫేమస్.. భాషతో సంబంధం లేకుండా కొరియన్ డ్రామాలు అభిమానుల ఆదరణను సొంతం చేసుకుంటున్నాయి. అయితే మీరు, మీ స్నేహితులతో కొరియన్ డ్రామాలను చూడాలనుకుంటున్నారా.. అయితే ఐదు ఉత్తమ కొరియన్ డ్రామాలు మీ కోసం..
Updated on: May 08, 2023 | 1:14 PM

కొరియన్ డ్రామాలు అనతికాలంలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇలా ప్రపంచ ఖ్యాతిగాంచడానికి కారణం ప్రత్యేక స్క్రిప్ట్. భిన్నమైన, అద్భుతమైన కథ, కథనం. దీంతో కొరియన్ డ్రామాలను ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఇష్టపడుతున్నారు. ఈ రోజు మీకు 5 సూపర్‌హిట్ కొరియన్ డ్రామాల గురించి తెలుసుకుందాం.. ఈ కొరియన్ డ్రామాలను హిందీలో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు.

వెబ్ సిరీస్- SF8: ప్రపంచవ్యాప్తంగా మెచ్చిన సిరీస్. SF8 అనేది ఫాంటసీ రొమాంటిక్ యాక్షన్ వెబ్ సిరీస్. మీరు ఈ వెబ్ సిరీస్‌ను MX ప్లేయర్‌లో చూడవచ్చు. ఈ సిరీస్ స్క్రిప్ట్ ప్రేక్షకులకు బాగా నచ్చింది.

'ది లెజెండ్ ఆఫ్ ది బ్లూ సీ'.. మత్యకన్య, మనిషికి మధ్య ఉన్నప్రేమ కథతో తెరకెక్కిన ఈ సిరీస్ కూడా అత్యధికంగా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ సిరీస్ 2016-17 సంవత్సరంలో వచ్చింది. ఈ సిరీస్ ను నెట్‌ఫ్లిక్స్‌లో హిందీలో చూడవచ్చు.

స్నోడ్రాప్ ఈ ఉక్రెయిన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది. స్నోడ్రాప్ సిరీస్ ను MX ప్లేయర్‌లో హిందీలో చూడగలిగే ఉక్రెయిన్ వెబ్ షో. ఇందులో 16 ఎపిసోడ్‌లు ఉన్నాయి. వీటిని మీరు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో చూడవచ్చు.

జువెనైల్ జస్టిస్ : ఈ సిరీస్ మొదటి సీజన్‌లో 10 ఎపిసోడ్‌లు ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. శిక్ష విషయంలో ఏమాత్రం కనికరం చూపని న్యాయమూర్తి కథ ఇది. ఈ సిరీస్ కథ చాలా ప్రత్యేకమైనది. ఇది ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. అటువంటి పరిస్థితిలో మీకు కావాలంటే దీనిని నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.

రెయిన్ ఆర్ షైన్: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రెయిన్ అండ్ షైన్‌ని కూడా చూడవచ్చు. ఈ సిరీస్ కథ ప్రేక్షకులకు బాగా నచ్చింది.





























