Kerala Boat Tragedy: కేరళ బోటు ప్రమాదంలో 22కు చేరిన మృతుల సంఖ్య.. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం

కేరళలోని మలప్పురం జిల్లాలో తానూర్ తీరంలో ఆదివారం రాత్రి 7గంటల సమయంలో పర్యాటకుల బోటు బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 22కి చేరుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 40 మంది ఉన్నట్లు అధికారులు అంచనా..

Kerala Boat Tragedy: కేరళ బోటు ప్రమాదంలో 22కు చేరిన మృతుల సంఖ్య.. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం
Kerala Boat Accident
Follow us
Srilakshmi C

|

Updated on: May 08, 2023 | 5:32 PM

కేరళలోని మలప్పురం జిల్లాలో తానూర్ తీరంలో ఆదివారం రాత్రి 7గంటల సమయంలో పర్యాటకుల బోటు బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 22కి చేరుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 40 మంది ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రెస్య్కూ టీమ్ ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. క్షతగాత్రులను తిరురంగాండి ఆసుపత్రికి తరలించారు. కేరళ ముఖ్యమంత్రి పినయని విజయన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం పరామర్శించారు. వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని, బోటు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్న మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు నిపుణులతో కూడిన జుడిషియల్ విచారణకు ఆదేశించారు.

కాగా మే 7వ తేదీ రాత్రి పరప్పనంగడిలో డబుల్‌ డెక్కర్‌ బోటు ఓవర్‌ లోడ్‌ కారణంగా నీట మునిగింది. ఈ ప్రమాదంలో ఓ పోలీస్‌ ఆఫీసర్‌తో సహా మొత్తం 22 మంది మృతి చెందగా, 10 మంది తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. మరో ఐదుగురు ఈత కొట్టుకుంటూ ఓడ్డుకు చేరినట్లు సమాచారం. దీంతో మొత్తం 37 మంది వివరాలు గుర్తించారు. బోటులో మొత్తం ఎంత మంది ఉన్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన వారు 12 మంది ఉన్నట్లు తెలుస్తుంది. ఆ కుటుంబాన్ని కూడా సీఎం విజయన్ పరామర్శించారు. ప్రధాని మోదీ ఇప్పటికే మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.