Lokesh Kurnool Padayatra: కర్నూలులో పొలిటికల్ హీట్.. స్థానిక ఎమ్మెల్యేపై భూ కబ్జా ఆరోపణలు చేసిన లోకేష్‌

కర్నూలులో పొలిటికల్‌ టెంపరేచర్‌ ఒక్కసారిగా సెగలు పుట్టించింది. లోకేష్‌తో బహిరంగ చర్చ కోసం యువగళం పాదయాత్రకు ఎదురెళ్లే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌. ఉద్రిక్తతకు దారితీయడంతో.. కర్నూలు నగరం కాసేపు అట్టుడికింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో..

Lokesh Kurnool Padayatra: కర్నూలులో పొలిటికల్ హీట్.. స్థానిక ఎమ్మెల్యేపై భూ కబ్జా ఆరోపణలు చేసిన లోకేష్‌
Nara Lokesh Kurnool Padayatra
Follow us

|

Updated on: May 08, 2023 | 6:02 PM

కర్నూలులో పొలిటికల్‌ టెంపరేచర్‌ ఒక్కసారిగా సెగలు పుట్టించింది. లోకేష్‌తో బహిరంగ చర్చ కోసం యువగళం పాదయాత్రకు ఎదురెళ్లే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌. ఉద్రిక్తతకు దారితీయడంతో.. కర్నూలు నగరం కాసేపు అట్టుడికింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో యువగళం పాదయాత్ర చేస్తున్న టీడీపీ నేత నారా లోకేష్‌ స్థానిక ఎమ్మెల్యేలపై చేస్తున్న ఆరోపణలు తీవ్ర ఉద్రిక్తతకు… మాటల యుద్ధానికి దారితీస్తున్నాయి. తాజాగా కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌పై గురిపెట్టారు లోకేష్‌. వక్ఫ్‌ భూములను స్థానిక ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ కబ్జా చేశారని.. దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని లోకేష్‌ వెల్లడించారు. దీంతో కర్నూలులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ చేసిన ఆరోపణలతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. లోకేష్‌ ఆరోపణలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌.

ఆరోపణలు నిరూపించాలని.. బహిరంగ చర్చకు రావాలని లోకేష్‌ను సవాల్‌ చేస్తూ పెద్ద సాహసమే చేశారు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌. యువగళం పాదయాత్రకు హఫీజ్‌ఖాన్‌ బైక్‌పై ఎదురెళ్లడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే వెంట పెద్దసంఖ్యలో అనుచరులు ఉండటంతో కర్నూలులో పొలిటికల్‌ టెంపరేచర్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. వైసీపీ, టీడీపీ శ్రేణులు ఎదురెదురు పడటంతో.. ఆ ప్రాంతం పోటాపోటీ నినాదాలతో హోరెత్తిపోయింది. పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన పోలీసులు.. ముందుగా ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా చర్చకు రావాలని మీసం మెలేసి టీడీపీ నేతలను సవాల్‌ చేశారు హఫీజ్‌ఖాన్‌. మొత్తానికి లోకేష్‌ యాత్రతో సీమలో రాజకీయ వాతావరణం గరంగరంగా తయారైంది. టీడీపీ విమర్శలకు గట్టిగానే బదులివ్వాలని అధికారపార్టీ నేతలు నిర్ణయించారనేది కర్నూలు ఘటన ద్వారా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.