Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

East Godavari: లోన్‌ యాప్‌ వేధింపులకు ఇంజనీరింగ్‌ విద్యార్ధి బలి.. మార్ఫింగ్‌ ఫొటోలు, అసభ్య పదజాలంతో చిత్రహింసలు

లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఇంజనీరింగ్‌ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. తాను తీసుకున్న మొత్తం కంటే ఎక్కువ సొమ్ము చెల్లించినా.. అసభ్య పదజాలంతో సందేశాలు పంపుతూ లోన్ యాప్ నిర్వాహకులు బాధిత యువకుడ్ని దారుణంగా హింసించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు బలవన్మరణానికి..

East Godavari: లోన్‌ యాప్‌ వేధింపులకు ఇంజనీరింగ్‌ విద్యార్ధి బలి.. మార్ఫింగ్‌ ఫొటోలు, అసభ్య పదజాలంతో చిత్రహింసలు
Loan App Harassment
Follow us
Srilakshmi C

|

Updated on: May 08, 2023 | 7:35 PM

లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఇంజనీరింగ్‌ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. తాను తీసుకున్న మొత్తం కంటే ఎక్కువ సొమ్ము చెల్లించినా.. అసభ్య పదజాలంతో సందేశాలు పంపుతూ లోన్ యాప్ నిర్వాహకులు బాధిత యువకుడ్ని దారుణంగా హింసించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తూర్పుగోదావరి జిల్లాలోని కడియం గ్రామానికి చెందిన సురకాసుల శ్రీనుకి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు కార్తీక్‌, చిన్నకుమారుడు హరికృష్ణ. టైలరింగ్‌ పని చేసుకుంటూ శ్రీను కొడుకులను చదివించేవాడు. హరికృష్ణ  (18) స్థానికంగా ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వ్యక్తిగత అవసరాల కోసం హరి ఈ ఏడాది జనవరి 28న కొన్ని లోన్‌ యాప్‌ల నుంచి లోన్ తీసుకున్నాడు. ఒక యాప్ లోన్ తీర్చేందుకు మరొక యాప్ నుంచి డబ్బులు తీసుకుంటూ వచ్చాడు. ఈ విధంగా మొత్తం రూ.1.50 లక్షలను యాప్‌లకు చెల్లించాడు. లోన్‌ తీసుకున్న దానికంటే అధికంగానే డబ్బు చెల్లించినప్పటికీ లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు ఆడలేదు. వాళ్లు అసభ్య పదజాలంతో సందేశాలు పంపుతూ, మార్ఫింగ్‌ చేసిన న్యూడ్‌ ఫొటోలు హరి వాట్సప్‌కు పంపుతూ దారుణంగా వేధించారు.

దీంతో హరి పోలీసులను ఆశ్రయించగా.. లోన్ యాప్ నిర్వాహకులకు పోలీసులు వార్నింగ్‌ ఇచ్చారు. కొద్దికాలం సర్దుమనిగినా మళ్లీ వేధించడం ప్రారంభించారు. ఈక్రమంలో హరి తమ ఇంట్లో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీను పెద్ద కుమారుడు కార్తీక్‌ ఇంటికి వచ్చి చూడగా ఫ్యానుకు విగతజీవిగా వేలాడుతున్న తమ్ముడిని చూసి షాక్‌కు గురయ్యాడు. హరి ఫోన్‌ పరిశీలించగా నగ్న చిత్రాలు, అసభ్య పదజాలంతో వాట్సప్‌లో మెసేజ్‌లు కనిపించాయి. తన కుమారుడి మరణానికి కారణమైన లోన్ యాప్ నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని తండ్రి శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

సాధారణ తనిఖీలు. తత్తరపాటుగా కనిపించిన ఓ వ్యక్తి..
సాధారణ తనిఖీలు. తత్తరపాటుగా కనిపించిన ఓ వ్యక్తి..
నిను వీడని నీడను నేను.. కాంట్రవర్సీయే కలెక్షన్ సీక్రెట్టా ..?
నిను వీడని నీడను నేను.. కాంట్రవర్సీయే కలెక్షన్ సీక్రెట్టా ..?
భార్య వేధింపుల కన్నా మరణమే మేలనుకున్నాడు..అందుకే ఇలా..వీడియో
భార్య వేధింపుల కన్నా మరణమే మేలనుకున్నాడు..అందుకే ఇలా..వీడియో
వేసిన సీల్‌ వేసినట్లే.. కల్తీ చేయడం చూసిషాకైన పోలీసులు వీడియో
వేసిన సీల్‌ వేసినట్లే.. కల్తీ చేయడం చూసిషాకైన పోలీసులు వీడియో
పాపం.. ఈ పెళ్లికొడుకు కష్టం ఎవరికీ రాకూడదు వీడియో
పాపం.. ఈ పెళ్లికొడుకు కష్టం ఎవరికీ రాకూడదు వీడియో
కన్నవారిని, కోట్ల ఆస్తిని కాదనుకుని ఈ అమ్మాయి చూడండి ఏం చేసిందో వ
కన్నవారిని, కోట్ల ఆస్తిని కాదనుకుని ఈ అమ్మాయి చూడండి ఏం చేసిందో వ
దిగొస్తున్న బంగారం ధర.. త్వరలో తులం రూ. 56వేలు వీడియో
దిగొస్తున్న బంగారం ధర.. త్వరలో తులం రూ. 56వేలు వీడియో
లోకల్​ Vs నాన్​ లోకల్ ఫైట్..కోతుల గుంపుల భీకర యుద్ధం వీడియో
లోకల్​ Vs నాన్​ లోకల్ ఫైట్..కోతుల గుంపుల భీకర యుద్ధం వీడియో
ఏఐతో మానవాళికి తప్పని ముప్పు.. గూగుల్‌ వార్నింగ్‌ వీడియో
ఏఐతో మానవాళికి తప్పని ముప్పు.. గూగుల్‌ వార్నింగ్‌ వీడియో
టఫ్ ఫైట్ లో బరిలోకి దిగిన సిద్దు.. జాక్ హిట్ కొట్టాడా ??
టఫ్ ఫైట్ లో బరిలోకి దిగిన సిద్దు.. జాక్ హిట్ కొట్టాడా ??