Andhra Pradesh: వామ్మో.. అదేంటీ..? రాత్రి అయితే చాలు.. కాకినాడ జిల్లాలో భయం.. భయం..

రాత్రి అయ్యిందంటే చాలు.. గుర్తు తెలియని జంతువు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఆ జిల్లాల ప్రజలు. వరుసగా లేగ దూడలపై దాడి చేసి చంపేస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. ఇంతకు అదీ పులేనా... లేదంటే మరేదైన జంతువు సంచరిస్తుందా...?

Andhra Pradesh: వామ్మో.. అదేంటీ..? రాత్రి అయితే చాలు.. కాకినాడ జిల్లాలో భయం.. భయం..
Kakinada News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 08, 2023 | 9:49 PM

రాత్రి అయ్యిందంటే చాలు.. గుర్తు తెలియని జంతువు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఆ జిల్లాల ప్రజలు. వరుసగా లేగ దూడలపై దాడి చేసి చంపేస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. ఇంతకు అదీ పులేనా… లేదంటే మరేదైన జంతువు సంచరిస్తుందా…? కాకినాడ జిల్లా జగ్గంపేటలో మరోసారి పశువులపై గుర్తుతెలియని జంతువు దాడి చేసింది. వరుస దాడిలతో రైతులను భయాందోళనకు గురి చేస్తోంది. రెండు రోజుల క్రితం ఎన్‌టి రాజాపురం గ్రామంలో చిరుత పులి పశువులపై దాడి చేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు… ఆ గ్రామంలో జంతువుల పాదముద్రలను సేకరించారు. పశులపై దాడి చేసిన జంతువును గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే గండేపల్లి మండలం ఉప్పలపాడులో పశువుల మందపై గుర్తుతెలియని జంతువు దాడి చేయడం కలకలం రేపుతోంది. పశువులపై దాడి చేసిన జంతువు చిరుతపులిగా అనుమానిస్తున్నారు స్థానికులు.

అటు పల్నాడు జిల్లా మాచర్ల- రాజానగరం అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుందన్న ప్రచారం కలకలం రేపింది. ఓ జంతువు అడవిలోకి పరిగెత్తుతూ స్థానికుల కెమెరాకు చిక్కింది. స్థానికులు ఆ వీడియోను వైరల్‌ చేయడంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పాదముద్రలు సేకరించి… జంతువును గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అది పులే అంటున్నారు స్థానికులు. దీంతో రైతులు ఒంటరిగా పొలాల్లోకి వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..