‘ఇకనైనా మా విడాకులపై ఆ వార్తలు రాయడం ఆపేస్తారనుకుంటా’.. మీడియకు చై రిక్వెస్ట్
అక్కినేని అందగాడు నాగచైతన్య ప్రస్తుతం ‘కస్టడీ’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఎక్స్ వైఫ్ సమంత గురించి మాట్లాడి అందర్నీ షాక్ అయ్యేలా చేశారు. గతం గతహ అనేలా మాట్లాడారు. కానీ ఇదే నాగచైతన్య.. తాజాగా జరిగిన మరో ఇంటర్య్వూలో తనపై సామ్ పై వస్తున్న న్యూస్ గురించి..
అక్కినేని అందగాడు నాగచైతన్య ప్రస్తుతం ‘కస్టడీ’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఎక్స్ వైఫ్ సమంత గురించి మాట్లాడి అందర్నీ షాక్ అయ్యేలా చేశారు. గతం గతహ అనేలా మాట్లాడారు. కానీ ఇదే నాగచైతన్య.. తాజాగా జరిగిన మరో ఇంటర్య్వూలో తనపై సామ్ పై వస్తున్న న్యూస్ గురించి రియాక్టయ్యారు. కోర్టు విడాకులు మంజూరు చేసి రెండేళ్లవుతున్నా ఇంకా కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాన్నే హైలైట్ చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. తమ విడాకులపై వార్తలు ఇకనైనా ఆపండి అంటూ… మీడియా సంస్థలను రిక్వెస్ట్ కూడా చేశారు.
మే 12న రిలీజ్ అయ్యేందుకు రెడీ అయిన.. తన బైలింగువల్ ప్రాజెక్ట్ కస్టడీ కోసం.. ఎట్ ప్రజెంట్ విపరీతంగా కష్టపడుతున్నారు చై. ప్రమోషన్ ఈవెంట్స్ అండ్ ఇంటర్వ్యూస్‌ను పరిగెత్తిస్తున్నారు. రిపోర్టర్ల నుంచి తనకు ఎదురవుతున్న ప్రశ్నలకు దిమ్మతిరిగేలా ఆన్సర్ ఇస్తున్నారు. దాంతో పాటే.. తను ఇంతకాలం దాచుకున్న విషయాలను.. తన ఆలోచనలను కూడ పంచుకుంటున్నారు. ఇక ఈక్రమంలోనే.. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలు తనను బాధపెడుతున్నాయంటూ.. చెప్పారు. సమంత తో తాను విడాలకులు తీసుకున్న విషయాన్ని ఇంకా సాగదీస్తూ వార్తలు ఇస్తున్న కొన్ని మీడియా సంస్థలపై.. యూట్యూబ్ ఛానెల్స్ పై అసహనం వ్యక్తం చేశారు.
తన సినిమాల గురించి ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా తనకు ఓకే అన్న నాగచైతన్య.. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకుంటే మాత్రం బాధపడతానన్నారు. కేవలం హెడ్‌లైన్స్ కోసం ఇలా చేయడం చాలా బాధాకరమన్నారు. దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల తాము విడిపోయామని.. కానీ, సమంత.. అంటే ఎంతో గౌరవం అన్నారు. కానీ రెండేళ్లుగా మీడియాలో వస్తున్న వార్తలు..సమంతపై తనకు గౌరవం లేనట్టుగా కన్వేచేస్తున్నాయన్నారు. ఇది తనను ఎంతగానో బాధిస్తోందని.. చై ఎమోషనల్ అయ్యారు.
అంతేకాదు… తమకు కోర్టు విడాకులు మంజూరు చేసి సంవత్సరంపైన అవుతున్నా.. కొన్ని మీడియ సంస్థలు..అండ్ యూట్యూబ్ ఛానెల్స్ ఇంకా ఇదే విషయాన్ని సాగదీస్తున్నాయన్నారు. తమ ఇద్దరితో పాటు ప్రమేయం లేని మూడో వ్యక్తిని కూడా వార్తల్లోకి లాగుతున్నారని.. దీని వల్ల వాళ్ల కుటుంబం ఎంత బాధపడుతుందని ఆలోచించడం లేదన్నారు. తాను సామ్ కలిసే.. తమ విడాకుల విషయంపై స్టేట్‌మెంట్ ఇచ్చాం. ఇకనైనా ఈ విషయాన్ని వదిలేస్తారని అశిస్తున్నా అంటూ.. చెప్పుకొచ్చారు చై.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.