Most Expensive Mango: ఇవి మామూలు మామిడి పండ్లుకాదండోయ్‌.. ఒక్కోటి ఏకంగా రూ.19 వేలు ధరపెట్టికొనాల్సిందే

వేసవిలో మామిడి పండ్ల కొనుగోలు జోరుగా ఉంటుంది. నోరూరించే మామిడి పండ్లు ఎక్కడ చూసినా దర్శనమిస్తుంటాయి. ఆకర్షణీయమైన రంగులో చూడగానే తినాలనిపించేలా ఉండే వీటిని తిననివారెవరుంటారు చెప్పండి. ధర కూడా మహా అయితే కిలో రూ.100 లోపే ఉంటుంది. ఐతే..

Most Expensive Mango: ఇవి మామూలు మామిడి పండ్లుకాదండోయ్‌.. ఒక్కోటి ఏకంగా రూ.19 వేలు ధరపెట్టికొనాల్సిందే
Most Expensive Mangos
Follow us

|

Updated on: May 09, 2023 | 8:10 PM

వేసవిలో మామిడి పండ్ల కొనుగోలు జోరుగా ఉంటుంది. నోరూరించే మామిడి పండ్లు ఎక్కడ చూసినా దర్శనమిస్తుంటాయి. ఆకర్షణీయమైన రంగులో చూడగానే తినాలనిపించేలా ఉండే వీటిని తిననివారెవరుంటారు చెప్పండి. ధర కూడా మహా అయితే కిలో రూ.100 లోపే ఉంటుంది. ఐతే జపాన్ లో ఓ వ్యక్తి పండిస్తోన్న మామిడి పండ్ల ధర ఏకంగా రూ.19,000. కిలో మామిడి పండ్ల ధర కాదు.. ఒక్క మామిడి పండు ధర అంత రేటుంది మరి. వీటిని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు ఇవేనట. ఈ మామిడి పండ్లు ఎందుకింత ప్రత్యేకమో ఎందుకో తెలుసుకుందాం..

జపాన్‌కు చెందిన హిరోయుకి నకగావా అనే 62 ఏళ్ల వ్యక్తి తన తోటల్లో ఫాగీ గ్రీన్‌హౌస్‌లో ఈ మామిడి పండ్లను పండిస్తున్నాడు. జపాన్‌లోని హొక్కడొ ద్వీపంలో ఉండే తోకచీలో ఆయన తోట ఉంది. సేంద్రీయ విధానంలో 2011 ఈ మామిడి పండ్లను సాగుచేస్తున్నాడు. ఆ ప్రాంతంలో డిసెంబరు నెలలో మైనస్‌ 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ సమయంలో నకగావా ఫాగీ గ్రీన్‌హౌస్ లోపల మాత్రం 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండేలా చూస్తాడు. ఇలా ప్రత్యేక వాతావరణంలో పండించిన మామిడి పండ్లకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ మామూలుగా ఉండదు మరి. అందుకే వీటిని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లుగా పేరుగాంచాయి.

మామిడి పండ్ల సాగులో తాను చేస్తోన్న ప్రయోగాల వల్ల ప్రపంచంలోనే అత్యధిక ధర పలికే మామిడిని పండిస్తానని తాను ఎప్పుడూ ఊహించలేదని నకగావా అంటున్నాడు. తాను సహజ సిద్ధంగా ఏదైనా చేయాలనుకుని ఈ ప్రయోగాలు మొదలు పెట్టానని.. మొదట్లో తన ప్రయోగాలను ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదని ఆయన తెలిపాడు. నకగావా పండించే మామిడి పండ్లు ‘హకుగిన్ నో తైయో’ బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నాడు. హకుగిన్ నో తైయో అంటే మంచులో ఎండ అని అర్ధం. మామిడి సీజన్‌లో దాదాపుగా 5 వేల పండ్ల వరక పండిస్తానని, తన వ్యాపారం ఎంతో ఆనందాన్నిస్తుందని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles