Guntur: వృద్ధురాలి ఇంట్లో రూ.4 లక్షల విలువైన బంగారాభరణాలు అపహరణ.. రైలులో మాటకలిపి ఇంటికొచ్చి చోరీ
ప్రయాణికురాలి ముసుగులో తోటి మహిళా ప్రయాణికులతో స్నేహం చేసినట్టు నటిస్తూ చోరీలకు పాల్పడిన తెనాలికి చెందిన మహిళను పొన్నూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆమె వద్ద నుండి 3,70,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని 11వ వార్డుకు చెందిన ఒక వృద్ధురాలు గత నెల 24వ తేదీన హైదరాబాదు నుంచి పొన్నూరు రైలులో ప్రయాణం చేసింది. ఈ సమయంలో అదే ట్రైన్‌లో తెనాలి పట్టణానికి చెందిన మరో మహిళ ఆమెతో స్నేహం నటించింది. నిడుబ్రోలులోని వృద్ధురాలు ఇంటికి తోడుగా వెళ్లి ఎవరూ లేని సమయంలో వృద్ధురాలు వద్దనున్న 11 సవర్ల బంగారం ఆభరణాలు, ఒక సెల్ ఫోన్ చోరీ చేసి పరారైంది. తన ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలుసుకున్న వృద్ధురాలు పొన్నూరు అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పొన్నూరు అర్బన్ పోలీసులు మంగళవారం ఉదయం తెనాలికి చెందిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమె వద్ద నుంచి 3 లక్షల 70 వేల రూపాయలు విలువచేసే బంగారు ఆభరణాలు, ఒక సెత్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.