Andhra Pradesh: ఆయనొస్తున్నారంటూ హడావుడి.. కల్లాల్లోని ధాన్యాన్ని ఒక్కాసారిగా ఖాళీ చేసిన అధికారులు..

అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో హఠాత్తుగా అధికారుల హడావిడి మొదలైంది. జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌ రైతులను పరామర్శించనున్నారని తెలిసి అధికారులు హడావిడి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఆ పార్టీ కార్యకర్తలు.

Andhra Pradesh: ఆయనొస్తున్నారంటూ హడావుడి.. కల్లాల్లోని ధాన్యాన్ని ఒక్కాసారిగా ఖాళీ చేసిన అధికారులు..
P Gannavaram
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 09, 2023 | 8:36 PM

ఏపీలో నిన్నటి వరకు రైతుల గోడు పట్టించుకోని అధికారులు హడావిడిగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు కోనసీమ జిల్లా పి.గన్నవరం జనసేన కార్యకర్తలు. ఇదే విషయంపై వ్యవసాయ శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం రాజులపాలెంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు రానున్నారు పవన్ కళ్యాణ్. నిన్నటి వరకు రైతుల గోడు వినిపించుకోని అధికారులు జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌ వస్తున్నారన్న వార్త తెలిసి హడావిడిగా రైతుల కల్లాల్లోకి వచ్చి బలవంతంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు ఆ పార్టీ కార్యకర్తలు.

జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడే రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసి, ట్రాక్టర్లలో తరలిస్తున్నారు అధికారులు. కనీసం తేమశాతం కూడా చెప్పకుండా రైతుల కల్లాల నుంచి ధాన్యం తీసుకెళ్తున్నారని ఆరోపిస్తున్నారు జనసేన కార్యకర్తలు.

నిన్నటి వరకు ధాన్యం కొనండి మహాప్రభో అంటూ నెత్తీనోరూ బాదుకున్నా పట్టించుకోలేదు అధికారులు. పైగా సంచులు లేవని…తేమ ఎక్కువగా ఉందని సాకులు చెప్పారు. ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నారని నిలదీశారు జనసేన కార్యకర్తలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే