- Telugu News Photo Gallery Male infertility: Watch out for these 5 common causes of sperm problems in men Relationship Tips in Telugu
Relationship Tips: మగ మహారాజులకు అలర్ట్.. ఆ విషయంలో వీక్ కావొద్దంటే ఇలా చేయాల్సిందే.. లేకపోతే..
ప్రస్తుత కాలంలో మనుషులను ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. జీవనశైలి, పని, బాధ్యత, అనారోగ్యం ఇలా ఎన్నో విషయాలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా కొంతమంది పురుషులు లైంగిక సమస్యలతో బాధపడుతుండటం ఆందోళనకు దారి తీస్తోంది. మగ వంధ్యత్వం, స్పెర్మ్ కౌంట్, లైంగిక సామర్థ్యం తగ్గుదల లాంటివి వేధిస్తున్నాయి.
Updated on: May 08, 2023 | 9:35 PM

ప్రస్తుత కాలంలో మనుషులను ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. జీవనశైలి, పని, బాధ్యత, అనారోగ్యం ఇలా ఎన్నో విషయాలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా కొంతమంది పురుషులు లైంగిక సమస్యలతో బాధపడుతుండటం ఆందోళనకు దారి తీస్తోంది. మగ వంధ్యత్వం, స్పెర్మ్ కౌంట్, లైంగిక సామర్థ్యం తగ్గుదల లాంటివి వేధిస్తున్నాయి.

పురుషులు స్పెర్మ్ కౌంట్ లేదా స్పెర్మ్ నాణ్యత తగ్గడం లాంటి సమస్యలు కొన్ని కారణాల వల్ల సంభవిస్తాయి. మనిషి పునరుత్పత్తి ఆరోగ్యం దెబ్బతింటే.. పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అయితే, అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు అలవాట్లు పురుషులలో స్పెర్మ్ కౌంట్, నాణ్యత తగ్గుదల లాంటి సమస్యలకు దారి తీస్తుందని పేర్కొంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అనారోగ్యకరమైన ఆహారాన్ని తినడం: అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఊబకాయం, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్‌కు దారితీస్తాయి. ఇవి పురుషుల సంతానోత్పత్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇది లైంగిక ఆరోగ్యం, సామర్థ్యంపై కూడా ప్రభావం చూపుతుంది.

పొగాకు: ధూమపానం మనిషి సంతానోత్పత్తిని ప్రభావితం చేసే హానికరమైన రసాయనాలను కలిగి ఉంటుంది. సిగరేట్ తాగేవారిలో స్పెర్మ్ కదలిక, రూపం పై ప్రభావితం చేస్తుంది. ఈ వేరియబుల్స్ గుడ్డును ఫలదీకరణం చేసే స్పెర్మ్ సంఖ్య, సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ధూమపానం DNA ఫ్రాగ్మెంటేషన్‌ను దెబ్బతీస్తుంది, ఫలితంగా పిండం నాణ్యత తక్కువగా ఉంటుంది. దీంతో సంతానోత్పత్తి రేటు తగ్గుతుంది. పిల్లలు పుట్టాలని ప్లాన్ చేసుకునే పురుషులు ధూమపానం మానేసి ఆరోగ్యంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆల్కహాల్: మద్యపానం పునరుత్పత్తి వ్యవస్థతో అనుసంధానించిన గ్రంధులను ప్రభావితం చేయడం ద్వారా సెక్స్ హార్మోన్లను దెబ్బతీస్తుంది. పిల్లలను కలిగి ఉండాలనుకునే పురుషులు మద్యపానాన్ని వదులుకోవాలి.

నిశ్చల జీవనశైలి: పేలవమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, తగినంత నిద్ర లేకపోవడం, ఎక్కువసేపు కూర్చోవడం, ఒత్తిడి, ఊబకాయం కూడా స్పెర్మ్‌పై ప్రభావం చూపుతాయి. పురుషులు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి సమతుల్య జీవనశైలిని అనుసరించాలి.

టైట్ జీన్స్ ధరించడం: టైట్ జీన్స్, బిగుతు లోదుస్తులు ధరించే పురుషులు యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్‌లతో (UTIs) బాధపడే అవకాశం ఉంది. దీనివల్ల తక్కువ స్పెర్మ్ కౌంట్, వృషణాల ఉష్ణోగ్రతను పెంచి ఫంగల్ ఇన్‌ఫెక్షన్ కు దారితీస్తుంది. కావున టైట్ జీన్స్ ధరించడం మానుకోండి..





























