‘మా మధ్యలోకి మూడో వ్యక్తిని తీసుకువస్తున్నారు.. హెడ్‌లైన్స్ కోసం ఇలా చేస్తారా?’
నాగ చైతన్యపై పుట్టుకొస్తున్న డేటింగ్ రూమర్స్‌పై ఇప్పటి వరకు ఎక్కడా పెదవి విప్పింది లేదు. అలాగే చై-సామ్ విడాకులు తీసుకుని రెండేళ్లు అవుతున్నా వీరిపై మీడియా కథనాలు ఇప్పటికీ ప్రసారం అవుతూనే ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో కూడా నిత్యం ఏదో ఒక రూమర్ క్రియేట్ అవుతూనే..
నాగ చైతన్యపై పుట్టుకొస్తున్న డేటింగ్ రూమర్స్‌పై ఇప్పటి వరకు ఎక్కడా పెదవి విప్పింది లేదు. అలాగే చై-సామ్ విడాకులు తీసుకుని రెండేళ్లు అవుతున్నా వీరిపై మీడియా కథనాలు ఇప్పటికీ ప్రసారం అవుతూనే ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో కూడా నిత్యం ఏదో ఒక రూమర్ క్రియేట్ అవుతూనే ఉన్నాయి. వీటి వల్ల తాను చాలా బాధపడుతున్నట్లు నాగ చైతన్య చెప్పుకొచ్చారు. తాజాగా కస్టడీ మువీ ప్రమోషన్స్‌లో భాగంగా చై ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
‘సోషల్ మీడియా నాకు ఎప్పుడూ అర్థంకాదు. సినిమాల విషయంలో లేదా నా గురించి మాట్లాడితే పట్టించుకోను. ఫ్యామిలీని ఇన్‌వాల్వ్ చేసి మ్యానిప్యులేట్ చేయడం.. పర్సనల్ లైఫ్‌కి అనుసంధానం చేసి మూడో వ్యక్తిని నా లైఫ్‌లోకి తీసుకొస్తే ఖచ్చితంగా నేను హర్ట్ అవుతాను. నా లైఫ్‌లో దురదృష్టవశాత్తు డివోర్స్ జరిగాయి. సామ్‌తో గడిపిన ఆ లైఫ్‌కి చాలా రెస్పెక్ట్ ఉంది. రకరకాల రూమర్స్ క్రియేట్ చేసి, మీడియా చేసే విషప్రచారం వల్ల ఆ గౌరవం పోతుంది. మేము విడాకులు తీసుకుని ఒకటిన్నర సంవత్సరం గడుస్తున్నా ఇంకా మీడియా దాన్ని సాగదీస్తుంది. మా ఇద్దరి పేర్లు పెట్టి సంబంధంలేని మూడో పేరుని ఇన్వాల్వ్ చేసి రూమర్స్ క్రియేట్ చేయడం, తక్కువ చేసి మాట్లాడి.. హెడ్‌లైన్స్ కోసం వాళ్ల ఫ్యామిలీని ఇందులోకి తీసుకురావడం బాధగా అనిపిస్తుంది. వాళ్ల కుటుంబాలు ఎంతగా బాధపడుతాయో ఆలోచించడం లేదు. కేవలం హెడ్‌లైన్స్ కోసం ఇలా చేయడం చాలా బాధాకరం. ఇకనైనా దీనిపై వార్తలు రాయడం ఆపుతారనుకుంటా. విడాకులపై నేను, సామ్ బహిరంగంగా స్టేట్‌మెంట్ ఇచ్చాం. మర్చిపోయి ముందుకు వెళ్లడం మంచిది. మీడియా వేరే విషయాలపై ఫోకస్ పెడితే బాగుంటుంది. నా ప్రొఫెషన్ లైఫ్‌తో ఎంటర్‌టైన్ చేయడానికి సినీ ఇండస్ట్రీలోకి వచ్చాను. నా పర్సనల్ లైఫ్‌తో కాదని’ చై ఎమోషనల్ అయ్యారు.
డైరెక్టర్లపై చై అభిప్రాయం ఒక్కమాటలో..
- వాసువర్మ.. స్వీట్ నెస్
- గౌతమ్‌మీనన్.. స్టైల్ (ఆయన వాయిస్ మాడ్యులేషన్ చాలా బాగుంటుంది)
- విక్రమ్ కుమార్.. ఇన్నోసెన్స్
- కళ్యాన్ కృష్ణ.. కమర్షియల్ పల్స్
- శేఖర్.. సింపుల్ పర్సన్
- వెంకట్ ప్రభు.. హౌటు చిల్ యువర్ లైఫ్
హీరోయిన్స్‌పై ‘చై’ అభిప్రాయం ఒక్కమాటలో..
- పూజాహెగ్డే.. స్టైల్
- కృతి శెట్టి.. ఇన్నోసెన్స్
- సాయి పల్లవి.. డ్యాన్స్
- శృతీ హాసన్.. మల్టీ ట్యాలెంటెడ్
- సమంత.. హార్డ్‌వర్క్
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.