- Telugu News Photo Gallery Cinema photos Actress Parineeti Chopra house gets decked up ahead of engagement with APP MP Raghav Chadha
Parineeti Chopra: అబ్బే అదేంలేదంటూనే పెళ్లికి సిద్ధమైన జంట.. అందంగా ముస్తాబైన పరిణీతి ఇల్లు
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా ప్రేమ వ్యవహారం పట్టాలెక్కనుంది. వీరిద్దరూ కలిసి ముంబై వీధుల్లో డిన్నర్, లంచ్ అంటూ చట్టాపట్టాలేసుకు తిరుగుతూ మీడియా కంట పడినా.. అబ్బే అదేం లేదంటూ కొట్టిపారేశారు. .
Updated on: May 12, 2023 | 2:37 PM

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా ప్రేమ వ్యవహారం పట్టాలెక్కనుంది. వీరిద్దరూ కలిసి ముంబై వీధుల్లో డిన్నర్, లంచ్ అంటూ చట్టాపట్టాలేసుకు తిరుగుతూ మీడియా కంట పడినా.. అబ్బే అదేం లేదంటూ కొట్టిపారేశారు.

ఎటువంటి హంగామాలేకుండా సైలెంగ్‌గా తమ రిలేషన్‌షిప్‌ను పెళ్లిబంధంగా మార్చుకునేందుకు సిద్ధమైపోయారు. ఐతే తమ ప్రేమ విషయంపై ఇద్దరూ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు.

ఈ శనివారం (మే 13) ఢిల్లీలో రాఘవ్ చద్దాతో పరిణీతి చోప్రా నిశ్చితార్థం జరగనుంది. ఈ నేపథ్యంలో ముంబైలోని పరిణీతి చోప్రా ఇంటిని ఇప్పటికే అందంగా ముస్తాబు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

పరిణీతి-రాఘవ్‌ల ఎంగేజ్‌మెంట్‌కు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారని సమాచారం. నిశ్చితార్థ వేడుకలో ఫ్యాషన్ డిజైనర్ పవన్ సచ్‌దేవా రూపొందించిన డిజైనర్ డ్రెస్‌లో కనిపించనుండగా, పరిణీతి చోప్రా మనీష్ మల్హోత్రా స్పెషల్‌గా డిజైన్ చేసిన భారత తీయ సంప్రదాయ వస్త్రాల్లో కనిపించనుంది. పరిణీతి డిజైనర్‌తో కలిసి చాలాసార్లు కనిపించింది కూడా. దీంతో రాఘవ్‌తో ఆమె పెళ్లి పుకార్ల మరింత బలం చేకూర్చినట్లైంది.

మంగళవారం పరిణీతి-రాఘవ్ జంట ఢిల్లీ విమానాశ్రయంలో మీడియా కంట పడ్డారు. పెళ్లికి పిలుస్తారా.. అంటూ ఫోటోగ్రాఫర్లు అడిగిన ప్రశ్నలకు పరిణీతి ముఖం చాటేయగా.. రాఘవ్ నవ్వుతూ అక్కడి నుంచి నిష్క్రమించారు.





























