తండ్రి శవాన్ని 18 నెలలుగా ఫ్రిజ్‌లో దాచిన 82 ఏళ్ల కొడుకు ‘నాన్నతో మాట్లాడకుండా ఉండలేను..’
రోజూ తండ్రితో మాట్లాడాలని ఓ కొడుకు 18 నెలలపాటు తండ్రి మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచాడు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. మరణించిన వ్యక్తి కొడుకు వయసు 82 కావడం విశేషం. వివరాల్లోకెళ్తే..
రోజూ తండ్రితో మాట్లాడాలని ఓ కొడుకు 18 నెలలపాటు తండ్రి మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచాడు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. మరణించిన వ్యక్తి కొడుకు వయసు 82 కావడం విశేషం. వివరాల్లోకెళ్తే..
నెదర్లాండ్‌లోని ల్యాండ్‌గ్రాఫ్ పట్టణంలో నివసం ఉంటున్న ఓ డచ్ వ్యక్తి (82) తండ్రి 101 ఏళ్ల వయసులో వయోభారంతో మరణించాడు. ఐతే తండ్రి మరణించి ఏడాదిన్నర అవుతున్నా మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించకుండా ఫ్రిజ్‌లో భద్రపరిచాడు. ఆ కుటుంబం ఫ్యామిలీ డాక్టర్ పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగు చూసింది. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి చూడగా ఇళ్లు మొత్తం చెత్తాచెదారంతో అస్తవ్యస్తంగా ఉండటాన్ని గమనించారు. ఫిజ్‌ల్ శవాన్ని భద్రపరచండంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇన్ని నెలలుగా తండ్రి మృతదేహాన్ని ఇంట్లోనే ఎందుకు దాచావని పోలీసులు ప్రశ్నించగా.. తన తండ్రిని చాలా మిస్సవుతున్నానని, తన తండ్రితో మాట్లాడకుండా ఉండలేనని, అందుకే 18 నెలలుగా తండ్రి డెడ్ బాడీని ఫ్రిజ్‌లో భద్రపరచినట్లు సదరు వ్యక్తి పోలీసులకు వెల్లడించాడు. ఇప్పటికీ రోజూ తండ్రితో మాట్లాడుతున్నానని అతను చెప్పడం కొసమెరుపు.
ఇక ఈ కేసులో తండ్రి మృతికి సంబంధించి కొడుకుపై ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులు తెలిపారు. చాలా ఏళ్లుగా ట్యూమర్‌తో బాధపడుతున్న తండ్రిని తరచూ ఆస్పత్రికి కూడా వెళ్తారని చుట్టుపక్కల వారు తెలియజేశారు. ఇక 82 ఏళ్ల కొడుకు స్వతహాగా పనులు కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నాడని, ఇంట్లో వస్తువులన్నీ చెల్లా చెదురుగా ఉన్నాయని, వారం రోజుల తర్వాత విచారణ కొనసాగిస్తామరి పోలీసులు మీడియాకు తెలిపారు. కాగా గతంలో కూడా ఇలాంటి సంఘటన 2015లో వెలుగు చూసింది. ఓ వ్యక్తి పింఛన్ కోసం మరణించిన తన తల్లి మృతదేహాన్ని రెండేళ్లపాటు ఫ్రిజ్‌లో దాచి.. ఆ తర్వాత పోలీసులకు దొరికిపోయినట్లు డచ్ పోలీసులు మీడియాకు తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.