ఆత్మహత్యలు చేసుకోవాలని ఏ నెలలోనే ఎక్కవగా అనిపిస్తోందో తెలుసా.. ?
వ్యక్తిగత కారణాల వల్ల క్షణికావేశంలో చాలామంది ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచనలు మాత్రం ప్రత్యేకమైన సందర్భాల్లో ఎక్కవగా వస్తున్నాయని ఓ నివేదిక తెలిపింది. ఆత్మహత్య ఆలోచనలు.. ఏడాదిలో ఏ నెలలో ఎక్కువగా వస్తున్నాయి.. ఏ సమయంలో ఎక్కవగా వస్తున్నాయి అనే విషయాలు గుర్తించేందుకు నెదర్లాండ్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఆమ్‌స్టర్‌డామ్, అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ, బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్‌హమ్ స్కూల్ ఆఫ్ సైకాలజీలు సంయుక్త పరిశోధనలు చేపట్టాయి.
వ్యక్తిగత కారణాల వల్ల క్షణికావేశంలో చాలామంది ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచనలు మాత్రం ప్రత్యేకమైన సందర్భాల్లో ఎక్కవగా వస్తున్నాయని ఓ నివేదిక తెలిపింది. ఆత్మహత్య ఆలోచనలు.. ఏడాదిలో ఏ నెలలో ఎక్కువగా వస్తున్నాయి.. ఏ సమయంలో ఎక్కవగా వస్తున్నాయి అనే విషయాలు గుర్తించేందుకు నెదర్లాండ్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఆమ్‌స్టర్‌డామ్, అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ, బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్‌హమ్ స్కూల్ ఆఫ్ సైకాలజీలు సంయుక్త పరిశోధనలు చేపట్టాయి. అయితే వీటికి సంబంధించిన ఫలితాలు నేచర్ నేచర్ ట్రాన్స్‌లేషనల్ సైకియాట్రి జర్నల్‌లో ప్రచూరించాయి. రోజూ ఉదయం వేళతోపాటు అత్యధికంగా డిసెంబర్ నెలలోనే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు ఎక్కువగా వస్తున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది.
ఇందుకోసం ఆలోచన విధానం ఏయే సందర్భాల్లో ఎలా ఉంటుంది..? చనిపోవాలని ఎప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది..? అన్న విషయాలపై ప్రశ్నావళిని రూపొందించారు. ఇలా దాదాపు ఆరు సంవత్సరాల పాటు 10 వేల మంది నుంచి వారి స్పందనలను సేకరించారు. శీతాకాలంలో ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతాయని ప్రజలు భావించినప్పటికీ.. వసంత కాలం లేదా వేసవి తొలినాళ్లలోనే ఇవి అధికంగా జరుగుతాయని ఈ అధ్యయనంలో తేలిసింది. ముఖ్యంగా తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల సమయంలోనే అత్మహత్యలు అధికంగా చేసుకుంటున్నారని పరిశోధకులు గుర్తించారు. డిసెంబర్‌లో ఆత్మహత్యల ఆలోచన ఎక్కవగా ఉండగా.. జూన్‌లో ఇటువంటి ఆలోచనలు చాలా తక్కువగా ఉంటున్నాయని కనుగొన్నారు.
NOTE: ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచనలు వస్తే 9152987821 నంబర్‌కు కాల్ చేయండి
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.