Karnataka Election Results: నేడే కర్నాటక అసెంబ్లీ ఫలితాలు.. గద్దెనెక్కేదెవరు? చతికిలపడేదెవరు?

నరాల తెగే ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడబోతోంది. కన్నడ భవితవ్యం రేపు తేలిపోనుంది. మరి, కర్నాటక తీర్పు ఎలా ఉండబోతోంది. ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు నిజమవుతాయా?. కర్నాటక కింగ్‌ ఎవరు?. కింగ్‌ మేకర్‌ ఎవరు!. అధికార పీఠమెక్కే పార్టీ ఏది!. కర్నాటక కౌంటింగ్‌ అప్‌డేట్స్‌ను క్షణక్షణం మీకందించబోతోంది టీవీ9. విస్తృతమైన నెట్‌వర్క్‌తో నాన్‌స్టాప్‌గా..

Karnataka Election Results: నేడే కర్నాటక అసెంబ్లీ ఫలితాలు.. గద్దెనెక్కేదెవరు? చతికిలపడేదెవరు?
Karnataka Election Results
Follow us
Shiva Prajapati

| Edited By: Shaik Madar Saheb

Updated on: May 13, 2023 | 6:09 AM

నరాల తెగే ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడబోతోంది. కన్నడ భవితవ్యం రేపు తేలిపోనుంది. మరి, కర్నాటక తీర్పు ఎలా ఉండబోతోంది. ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు నిజమవుతాయా?. కర్నాటక కింగ్‌ ఎవరు?. కింగ్‌ మేకర్‌ ఎవరు!. అధికార పీఠమెక్కే పార్టీ ఏది!. కర్నాటక కౌంటింగ్‌ అప్‌డేట్స్‌ను క్షణక్షణం మీకందించబోతోంది టీవీ9. విస్తృతమైన నెట్‌వర్క్‌తో నాన్‌స్టాప్‌గా ఎక్స్‌క్లూజివ్‌ కవరేజ్‌ ఇవ్వబోతోంది మీ టీవీ9.

మరికొన్ని గంటల్లో కర్నాటక తీర్పు విడుదలకానుంది. ఈవీఎంల్లో నిక్షిప్తమైన పార్టీల భవితవ్యం తేలిపోనుంది. కన్నడ ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టారో!, ఏ పార్టీకి ఝలక్‌ ఇచ్చారో! ఏ నేత తలరాతను ఎలా రాశారో! బయటికి రానుంది. కర్నాటకలో టోటల్‌గా 73.19శాతం పోలింగ్‌ నమోదైంది. ఓట్ల లెక్కింపు కోసం స్టేట్‌ వైడ్‌గా 34 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైతే, 10గంటలుకల్లా తొలి ఫలితం రానుంది.

మరి, ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు?. ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది?. ఈ ప్రశ్నలకు మెజారిటీ ఎగ్జిట్‌పోల్‌ సర్వేలన్నీ దాదాపు ఒకే ఒక్క ఆన్సర్‌ చెప్పాయ్‌. సర్వేలన్నీ కాంగ్రెస్‌కే బిగ్గెస్ట్‌ నెంబర్స్‌ను కట్టబెట్టాయ్‌. కొన్ని సంస్థలు కాంగ్రెస్‌కి క్లియర్‌కట్‌ మెజారిటీ ఇస్తే, మరికొన్ని సింగిల్ లార్జెస్ట్‌ పార్టీగా అవతరిస్తుందని చెప్పుకొచ్చాయ్‌. టీవీ9 సర్వేలో కూడా కాంగ్రెస్సే అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని తేలింది. కాంగ్రెస్‌కి 99నుంచి 109 స్థానాలు, బీజేపీకి 88నుంచి 98 సీట్లు, జేడీఎస్‌కి 21నుంచి 26 స్థానాలు వస్తాయని అంచనా వేసింది టీవీ9 నెట్‌వర్క్‌ అండ్‌ పోల్‌స్ట్రాట్. మరి. ఎగ్జిల్‌పోల్‌ సర్వేలు నిజమవుతాయా? లేదా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

ఇవి కూడా చదవండి

ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు ఇలాగుంటే, ఫలితాలపై జోరుగా బెట్టింగ్స్‌ జరుగుతున్నాయ్‌. లక్షలు, కోట్లల్లో పందేలు నడుస్తున్నాయ్‌. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని కొందరు, కాంగ్రెస్‌ గెలుస్తుందని మరికొందరు, జేడీఎస్‌ కింగ్‌ మేకర్‌ అవుతుందని ఇంకొందరు.. బెట్టింగ్స్‌ కాస్తున్నారు. డబ్బే కాదు, పొలాలు, ఆస్తులు, బైక్లు, కార్లను కూడా ఫణంగా పెడుతున్నారు పందెంరాయుళ్లు.

ఫలితాలపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌.. గెలుపు తమదే అంటున్నాయ్‌. ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు కొంత కాంగ్రెస్‌కి అనుకూలంగా ఉన్నా.. బీజేపీతో టఫ్‌ ఫైట్‌ ఉందనేది మాత్రం నిజం. ఇక, జేడీఎస్‌ పాత్ర ఎలా ఉండబోతుందనేది ఫలితాల తర్వాతే తెలుస్తుంది. మరి, కర్నాటక కింగ్‌ ఎవరు?. కింగ్‌ మేకర్‌ ఎవరు?. మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..