AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: తొలిసారి తండ్రిని క‌లిసిన బేబీ గొరిల్లా.. రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

తల్లి, బిడ్డల బంధాన్ని వర్ణించలేం. తల్లి తన బిడ్డలను కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. వారి ఆలనా, పాలనా, లాలన అన్నీ చూస్తుంది. ఇక తండ్రి, బిడ్డల బంధం చాలా విచిత్రమైనది. గుండెనిండా ప్రేమ ఉన్నా.. ఎలా చూపాలో తెలియని అమాయకత్వం తండ్రిది. లోలోతుల్లోని ఆ ప్రేమను కేవలం తన చేతల ద్వారా..

Watch Video: తొలిసారి తండ్రిని క‌లిసిన బేబీ గొరిల్లా.. రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Baby Gorilla
Shiva Prajapati
|

Updated on: May 10, 2023 | 6:24 PM

Share

తల్లి, బిడ్డల బంధాన్ని వర్ణించలేం. తల్లి తన బిడ్డలను కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. వారి ఆలనా, పాలనా, లాలన అన్నీ చూస్తుంది. ఇక తండ్రి, బిడ్డల బంధం చాలా విచిత్రమైనది. గుండెనిండా ప్రేమ ఉన్నా.. ఎలా చూపాలో తెలియని అమాయకత్వం తండ్రిది. లోలోతుల్లోని ఆ ప్రేమను కేవలం తన చేతల ద్వారా మాత్రమే చూపుతాడు. తండ్రి తన పిల్లల ప్రతి కదలికను ఆనందిస్తాడు. తన అవసరాలను పక్కనబెట్టి.. తన పిల్లల సంతోషంలోనే తన సంతోషాన్ని వెతుక్కుంటాడు నాన్న. అందుకే.. తండ్రీ బిడ్డల మధ్య ప్రేమ అత్యంత మధురమైనది. ఓ తండ్రి తొలిసారి తన బిడ్డను చూసినప్పుడు, బిడ్డను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు కలిగి ఆనందం, మనసులో ఉప్పొంగే సంతోషం వర్ణించడం సాధ్యం కాదు.

తాజాగా ఇలాంటి సంతోషకరమైన, ఉద్వేగభరితమైన సన్నివేశానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ బేబీ గొరిల్లా తొలిసారి తన తండ్రిని కలుసుకుంది. ఆ క్షణంలో బేబీ గొరిల్లా, తండ్రి గొరిల్లా ప్రవర్తన చూసేందుకు రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. ఈ ఉద్వేగభరితమైన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్‌లో షేర్ చేశారు. బేబీ గొరిల్లా తొలిసారి తండ్రిని క‌లిసింద‌ని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోలో పిల్ల గొరిల్లా త‌న తండ్రి ముఖాన్ని మెల్లగా త‌డుముతూ గుర్తించేందుకు ప్రయ‌త్నించ‌డం క‌నిపిస్తుంది. ఆ రెండు గొరిల్లాల కదలికలు హార్ట్ మెల్ట్ అయ్యేలా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

నెట్టింట ఈ వీడియో తెగ వైర‌ల‌వుతుండ‌గా ఇప్పటివ‌ర‌కూ ఈ క్లిప్‌ను 64,000 మందికి పైగా వీక్షించారు. కామెంట్స్ సెక్షన్ పూర్తిగా హార్ట్‌, ల‌వ్ ఎమోజీల‌తో నిండిపోయింది. న్యూరోస‌ర్జన్ భార్యగా నా పిల్లలు తండ్రితో మెలిగే తీరు నాకు తెలుసు.. ఇది కూడా అలాగే ఉంది అని మ‌రో యూజ‌ర్ కామెంట్ చేశారు. మరెందుకు ఆలస్యం.. ఈ వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఆ ఎనర్జీ ఏంట్రా.. పూజానే డామినేట్ చేసిన చిన్నోడు..
ఆ ఎనర్జీ ఏంట్రా.. పూజానే డామినేట్ చేసిన చిన్నోడు..
సాయి పల్లవి, శ్రీలీల రెమ్యునరేషన్స్ ఎన్ని కోట్లంటే..
సాయి పల్లవి, శ్రీలీల రెమ్యునరేషన్స్ ఎన్ని కోట్లంటే..
సమీరారెడ్డి దగ్గర ఉన్న స్పెషల్ బ్లౌజ్ ధర ఎంతో తెలుసా?
సమీరారెడ్డి దగ్గర ఉన్న స్పెషల్ బ్లౌజ్ ధర ఎంతో తెలుసా?
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం హవా.. పదుల సంఖ్యలో హంగ్
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం హవా.. పదుల సంఖ్యలో హంగ్
శివ భక్తులకు రైల్వేశాఖ మరో శుభవార్త
శివ భక్తులకు రైల్వేశాఖ మరో శుభవార్త
విజయ్ సభలో అభిమాని మృతి సంచలనం.. డీఎంకే–టీవీకే మధ్య మాటల యుద్ధం
విజయ్ సభలో అభిమాని మృతి సంచలనం.. డీఎంకే–టీవీకే మధ్య మాటల యుద్ధం
నేనే రాజు.. నేనే మంత్రి.! మున్సిపల్ ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే..
నేనే రాజు.. నేనే మంత్రి.! మున్సిపల్ ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే..
పెంపుడు పిల్లుల నుంచి పాఠాలు నేర్చుకున్నానంటున్న స్టార్ హీరోయిన్‌
పెంపుడు పిల్లుల నుంచి పాఠాలు నేర్చుకున్నానంటున్న స్టార్ హీరోయిన్‌
పాక్ బౌలర్ వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కు ఇచ్చిపడేసిన ఇషాన్..
పాక్ బౌలర్ వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కు ఇచ్చిపడేసిన ఇషాన్..
కేరళ స్టైల్ సాంబార్ రైస్ రెసిపీ.. ఇలా చేస్తే ముద్ద కూడా వదలరు!
కేరళ స్టైల్ సాంబార్ రైస్ రెసిపీ.. ఇలా చేస్తే ముద్ద కూడా వదలరు!