- Telugu News Photo Gallery Business photos Personal Finance: Planning To Take A Personal Loan? 5 Important Charges You Need To Know Details here
Personal Loan: పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ముందు ఈ 5 కీలక ఛార్జెస్ గురించి తెలుసుకోండి..
వివిధ అవసరాల నిమిత్తం చాలా మంది ప్రజలు బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్స్ తీసుకుంటారు. అయితే, పర్సనల్ లోన్స్ తీసుకునే ముందు.. మీరు ఖచ్చితంగా ఈ 5 రకాల చార్జీల గురించి తెలుసుకోవాలి. మరి ఆ ఛార్జీలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
Updated on: May 09, 2023 | 9:43 PM

వివిధ అవసరాల నిమిత్తం చాలా మంది ప్రజలు బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్స్ తీసుకుంటారు. అయితే, పర్సనల్ లోన్స్ తీసుకునే ముందు.. మీరు ఖచ్చితంగా ఈ 5 రకాల చార్జీల గురించి తెలుసుకోవాలి. మరి ఆ ఛార్జీలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

లోన్ ప్రాసెసింగ్ ఛార్జీలు: లోన్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేది లోన్ అప్లికేషన్‌ను ప్రాసెస్ చేయడానికి బ్యాంక్ రుణగ్రహీతపై విధించే ప్రాథమిక ఛార్జీ. ఈ ఛార్జీలు అప్లికేషన్ ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్, క్రెడిట్ మదింపు, చట్టపరమైన ధృవీకరణ, పరిపాలనా ఖర్చుల కోసం వేస్తారు.

ధృవీకరణ ఛార్జీలు: ధృవీకరణ ఛార్జెస్.. రుణ గ్రహీత అందించిన వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని ధృవీకరించడానికి రుణదాత నుంచి వసూలు చేసే వన్ టైమ్ ఛార్జెస్. మీరు కూడా పర్సనల్ లోన్ తీసుకుంటున్నట్లయితే.. వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లను, రుసుములను సరిపోల్చుకుని చూసుకోవడం మంచింది.

ఈఎంఐ డిఫాల్ట్‌లపై జరిమానా: లోన్ తీసుకున్న వారు అందుకు సంబంధించిన ఈఎంఐ పే చేయడానికి నెల/త్రైమాసిక/వార్షిక ఈఎంఐని సెట్ చేస్తారు. ఒప్పందం ప్రకారం.. ఆ ఈఎంఐ చెల్లించకపోతే.. డీఫాల్ట్ జరిమానా విధిస్తారు. అందుకే భరించగలిగే ఈఎంఐని మాత్రమే ఎంచుకోవాలి.

జీఎస్‌టీ: పర్సనల్ లోన్‌పై జీఎస్‌టీ కూడా ఉంటుంది. రుణ గ్రహీత లోన్ యాక్సెప్ లేదా, తిరిగి చెల్లించే వ్యవధితో ఈ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

ముందస్తు చెల్లింపు ఛార్జెస్: ముందస్తు చెల్లింపు ఛార్జెస్ అంటే.. రుణగ్రహీత గడువు తేదీకి ముందు రుణాన్ని తిరిగి చెల్లించినప్పుడు కట్టాల్సి ఉంటుంది. లోన్ రకం, బకాయి ఉన్న లోన్ మొత్తం, లోన్ రీపేమెంట్ కోసం మిగిలి ఉన్న సమయాన్ని బట్టి పెనాల్జీ మొత్తం మారవచ్చు. రుణం తీసుకునే ముందు ఒప్పందాన్ని జాగ్రత్తగా చదవాలి. ప్రీపేమెంట్, ఫోర్‌క్లోజర్ పెనాల్జీ నిబంధనలను అవగాహన చేసుకోవాలి.





























