- Telugu News Photo Gallery Business photos Rajasthan: pm narendra modi foundation stone redevelopment of udaipur Railway Station
Railway Station: విమానాశ్రయం తరహాలో రైల్వే స్టేషన్ నిర్మాణం.. పునరాభివృద్ధికి మోడీ శంకుస్థాపన
ఇక్కడి రైల్వే స్టేషన్ విమానాశ్రయంలా రూపుదిద్ధుకోనుంది. పునరావృద్ధిలో భాగంగా ఈ రైల్వే స్టేషన్‌కు రూపురేఖలు మారనున్నాయి. హైటెక్‌గా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో దీనిని నిర్మించనున్నారు..
Updated on: May 10, 2023 | 11:39 AM

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ రైల్వే స్టేషన్‌ను హైటెక్‌గా మార్చేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 354 కోట్లతో స్టేషన్‌ను అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయనున్నారు.

ఉదయపూర్ రైల్వే స్టేషన్ భవిష్యత్తు రూపకల్పనకు సంబంధించిన కొన్ని చిత్రాలు తెరపైకి వచ్చాయి. ఇందులో ఈ స్టేషన్ చాలా హైటెక్, అత్యాధునిక సౌకర్యాలతో అమర్చబడి ఉంటుంది. స్టేషన్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే 36 నెలల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు

రైల్వే స్టేషన్‌లో కొత్త ఇంధన వనరులు ఉపయోగించనున్నారు. అలాగే వ్యర్థాల నిర్వహణలో హైటెక్ వ్యవస్థ ఉంటుంది. అంతే కాదు వర్షపు నీటిని సేకరించే సాంకేతికతను కూడా ఇక్కడ అభివృద్ధి చేయనున్నారు.

స్టేషన్‌లో అన్ని అనుకూలమైన అన్‌రిజర్వ్‌డ్, ఎగ్జిక్యూటివ్ వెయిటింగ్ రూమ్‌లు తయారు చేయనున్నారు. ఇక్కడ స్థానిక ప్రజల కోసం స్టాల్ స్థలం కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ఆధునిక ప్యాసింజర్ సౌకర్యాలను అభివృద్ధి చేయనున్నారు.

స్టేషన్‌లో ప్రయాణికుల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని 20 కొత్త లిఫ్టులు, 26 కొత్త ఎస్కలేటర్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు స్టేషన్‌లో 72 మీటర్ల వెడల్పుతో కూడిన కాన్‌కోర్స్‌ను కూడా అభివృద్ధి చేయనున్నారు.





























