- Telugu News Photo Gallery Business photos Amazing offers on Maruti Suzuki cars.. Rs. 61 thousand benefit on many models
Maruti Suzuki: మారుతి సుజుకీ కార్లపై అద్భుతమైన ఆఫర్లు.. పలు మోడళ్లపై రూ.61 వేల ప్రయోజనం
కారు కొనుగోలు చేసేవారికి పలు కార్ల తయారీ కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. పలు మోడళ్లపై డిస్కౌంట్ ఆఫర్, అలాగే మారుతీ, టాటా కార్ల కొన్ని మోడల్స్ పై భారీ తగ్గింపు ఆఫర్లను ఇస్తోంది. నగదు తగ్గింపు, కార్పొరేట్ ప్రయోజనాలు, ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి..
Updated on: May 10, 2023 | 10:48 AM

కారు కొనుగోలు చేసేవారికి పలు కార్ల తయారీ కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. పలు మోడళ్లపై డిస్కౌంట్ ఆఫర్, అలాగే మారుతీ, టాటా కార్ల కొన్ని మోడల్స్ పై భారీ తగ్గింపు ఆఫర్లను ఇస్తోంది. నగదు తగ్గింపు, కార్పొరేట్ ప్రయోజనాలు, ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి.

మారుతి సుజుకి, టాటా మోటార్స్ కొన్ని మోడళ్ల ఎంపిక వేరియంట్లపై బాగా తగ్గింపును అందిస్తున్నాయి. ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటే కారును తక్కువ ధరల్లో దక్కించుకునే అవకాశం ఉంటుంది.

మారుతి WagonR, Alto K10, S.Presso, Swift .. Dzire వంటి మోడళ్లపై 61,000 రూపాయల వరకు మొత్తం ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని కంపెనీ చెబుతోంది.

ప్రస్తుతం, పెట్రోల్‌తో నడిచే వ్యాగన్ఆర్ అతి తక్కువ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర 5.51 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. అయితే, పెట్రోల్‌తో నడిచే డిజైర్ అత్యల్ప వేరియంట్ 6.51 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది.

మరోవైపు టాటా మోటార్స్ టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్‌లపై 33,000 రూపాయల వరకు ప్రయోజనాలను అందించింది. పెట్రోల్ పవర్డ్ Tiago XE అతి తక్కువ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర న్యూఢిల్లీలో 5.59 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది.

ఈ రెండు కార్ కంపెనీలు అందించిన ప్రయోజనాలలో నగదు తగ్గింపు, కార్పొరేట్ ప్రయోజనాలు, ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి.





























