IPL 2023: కొత్త కారుకు సొట్ట పెట్టిన ముంబై బ్యాటర్.. కట్ చేస్తే, ఆ ‘నేషనల్ పార్క్’ ఖాతాలో రూ.5 లక్షలు.. ఎలా అంటే..?
IPL 2023: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీపై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆర్‌సీబీ ఇచ్చిన 199 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు దిగిన ముంబై బ్యాటర్లు సిక్సర్ల మోత మోగించి, 16.3 ఓవర్లలోనే పని పూర్తి..
IPL 2023: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీపై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆర్‌సీబీ ఇచ్చిన 199 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు దిగిన ముంబై బ్యాటర్లు సిక్సర్ల మోత మోగించి, 16.3 ఓవర్లలోనే పని పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో సూర్య కుమార్ యాదవ్(83), నేహల్ వధేరా(52, నాటౌట్) కలిసి మూడో వికెట్‌కు 70 బంతుల్లోనే 140 పరుగుల భాగస్వామ్యంతో చెలరేగారు.
అయితే నేహల్ కొట్టిన ఓ షాట్ బౌండరీ బయట ఉన్న టాటా కార్‌కి తగిలి దానికి సొట్ట పడేలా చేసింది. అవును, వనిందు హసరంగ వేసిన 11వ ఓవర్‌లో నాల్గో బంతిని వధేరా బలంగా బాదాడు. అంతే అది నేరుగా వెళ్లి బౌండరీ లైన్ వెలుపల ఉన్న టాటా టియాగో కొత్త కారు డోర్ హ్యాండిల్ పైన తగిలింది. ఫలితంగా దానికి చిన్న డెంట్ పడింది. అలా తన వీర బాదుడుతో మ్యాచ్‌ని ముంబై సొంతం చేశాడు వధేరా. అయితే వధేరా కొట్టిన షాట్‌కి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట వైలర్ అవుతోంది.
@mipaltan @MIFansTamilNadu #Nehalwadhera hits six and hits the Tata Tiago ev pic.twitter.com/xC3ORfF9bd
— Ashish jain (@ashishstjain) May 9, 2023
కాగా, ఐపీఎల్ ఆరంభంలో చెపాక్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నైఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన షాట్ కూడా టాటా టియాగో కారుకు తగిలింది. దీంతో వెనుక వైపున్న డోర్ మీద సొట్ట పడింది. ఇక ఐపీఎల్‌లో బ్యాటర్ కొట్టిన బంతి తమ కారుకు తగిలితే రూ.5 లక్షలను కజిరంగా నేషనల్ పార్క్‌కు విరాళంగా ఇస్తామని ఈ సీజన్ ఆరంభానికి ముందే టాటా గ్రూప్ ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే ఐపీఎల్ 2023 మ్యాచ్‌లు జరుగుతోన్న 12 మైదానాల్లో కార్లను ఏర్పాటు చేసింది. ఇక ఇప్పటికీ రెండు సార్లే ఆ కార్‌కి బంతి తగిలింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..