Venus Transit 2023: కర్కాటకరాశిలో శుక్రుడు.. ఈ రాశులపై ‘రాక్షస గురు’ ప్రభావం ఎలా ఉండనుందంటే..?

Venus Transit 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల స్థితిగతులు మానవ జీవితంపై ప్రభావం చూపుతాయి. ఈ ప్రభావాలు కొందరికి లాభదాయకంగా, మరికొందరిక దు:ఖదాయకంగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ నెల 30న రాత్రి 7:39 గంటలకు కుజుడు కర్కాటక రాశిలోకి..

Venus Transit 2023: కర్కాటకరాశిలో శుక్రుడు.. ఈ రాశులపై ‘రాక్షస గురు’ ప్రభావం ఎలా ఉండనుందంటే..?
Venus Transit 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 10, 2023 | 10:49 AM

Venus Transit 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల స్థితిగతులు మానవ జీవితంపై ప్రభావం చూపుతాయి. ఈ ప్రభావాలు కొందరికి లాభదాయకంగా, మరికొందరిక దు:ఖదాయకంగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ నెల 30న రాత్రి 7:39 గంటలకు కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆపై జూలై 7న ఉదయం 3:59 గంటల వరకు శుక్రుడు కర్కాటకంలోనే ఉండనున్నాడు. ప్రేమాప్యాయత, అందానికి కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. పైాగా శుక్రడిని రాక్షసుల గురువు అంటారు. మీనరాశిలో ఉచ్ఛ స్థితిలోనూ, కన్యారాశిలో నీచ స్థితిలోనూ సంచరించనున్నాడు. ఫలితంగా కుంభరాశి, మీన రాశిపై శుక్రుడి ప్రభావం ఎలా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కుంభ రాశి: కర్కాటక రాశిలో శుక్రుని సంచారం ఆరో పాదంలో జరగబోతుంది. ఫలితంగా మీరు ఉద్యోగంలో సమస్యలు అంటే సహోద్యోగుల నుంచి వ్యతిరేకత, కుట్ర జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ సమయంలో మీరు మితమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం చాలా మంచిది. మరోవైపు మీరు ఈ సమయంలో ఆస్తి వివాదాలతో ఇబ్బందిపడే అవకాశం ఉంది. ఈ సమస్యల నుంచి తప్పించుకునేందుకు శుక్రుడిని ప్రసన్నం చేసుకోవాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

మీనరాశి: శుక్రుడు మీనరాశి ఐదో పాదంలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో మీరు ప్రేమలో పడేందుకు, కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లేందుకు అవకాశం ఉంది. ఇంకా కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..