IPL 2023: మరో మైలురాయి దాటిన సూర్య.. ఆర్‌సీబీపై 83 పరుగులు చేయడంతో ఆ లిస్టులోకి..

MI vs RCB: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 199 పరుగుల లక్ష్యాన్ని ఇవ్వడంతో బరిలోకి దిగిన ముంబై బ్యాటర్లు.. టార్గెట్‌ను సునాయాసంగా..

IPL 2023: మరో మైలురాయి దాటిన సూర్య.. ఆర్‌సీబీపై 83 పరుగులు చేయడంతో ఆ లిస్టులోకి..
Surya Kumar Yadav
Follow us

|

Updated on: May 10, 2023 | 9:26 AM

MI vs RCB: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 199 పరుగుల లక్ష్యాన్ని ఇవ్వడంతో బరిలోకి దిగిన ముంబై బ్యాటర్లు.. టార్గెట్‌ను సునాయాసంగా చేధించారు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ 83 పరుగులు, నేహల్ వధేరా 52 రన్స్ చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. అయితే ఈ మ్యాచ్‌లో 83 పరుగులు చేయడం ద్వారా సూర్య తన కెరీర్‌లో మరో మైలు రాయిని కూడా దాటాడు. ఈ మ్యాచ్‌లో 63 పరుగుల వద్ద సూర్య 3000 ఐపీఎల్ పరుగులను పూర్తి చేస్తున్నాడు. అలా ఈ మైలు రాయి చేరుకున్న 22 ఆటగాడిగా సూర్య నిలిచాడు. ఇంకా ఇక్కడ చెప్పుకోవలసిన మరో విశేషమేమిటంటే.. సూర్య ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌కు ప్రత్యర్థి టీమ్‌లోని విరాట్ కోహ్లీ కూడా ప్రశంసించాడు.

ఇప్పటివరకు 119 ఐపీఎల్ ఇన్నింగ్స్‌ ఆడిన సూర్య 141.45 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 3020 పరుగులు చేశాడు. ఇందులో 20 హాఫ్ సెంచరీలు, 325 ఫోర్లు, 102 సిక్సర్లు కూడా ఉండడం విశేషం. ఇంకా సూర్య కుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో సాధించిన మరో ఘనత ఏమిటంటే.. అతని ఐపీఎల్ కెరీర్‌లో ఇదే అత్యధిక స్కోర్. ఆర్‌సీబీపై 83 పరుగులు చేసిన సూర్యకు అంతకముందు అత్యధిక స్కోర్ 82 మాత్రమే.  2021 ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై సూర్య 82 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఈ క్రమంలో కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ 65, మ్యాక్స్‌వెల్ 68, దినేష్ కార్తిక్ 30 పరగులతో రాణించారు. ముంబై బౌలర్లలో బెహ్రండర్ఫ్ 3 వికెట్లతో చెలరేగగా, కామెరూన్ గ్రీన్, క్రిస్ జోర్డన్, కుమార్ కార్తికేయ తలో వికెట్‌ తీసుకున్నారు. అనంతరం 200 పరుగులు టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబైకి కెప్టెన్ రోహిత్ నుంచి సహకారం లభించకపోయినా ఇషాన్ కిషన్ 42, సూర్య కుమార్ యాదవ్ 83, నేహల్ వధేరా 52 పరుగులతో రాణించారు. అలా ముంబై గెలిచిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ తరఫున వనిందు హసరంగా, విజయ్‌కుమార్ వైశాక్ చెరో 2 వికెట్లు తీశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..