IPL 2023, MI vs RCB: సూర్యపై వెల్లువెత్తుతున్న మాజీల ప్రశంసల జల్లు.. కంప్యూటర్‌పై బ్యాటింగ్ చేస్తున్నట్లే ఉందంటూ..
MI vs RCB: మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సూర్య 83 పరుగులతో తన విశ్వరూపం చూపించాడు. తన కెరీర్ అత్యుత్తమ స్కోర్ అందుకునే క్రమంలో అతను చెలరేగడమే కాక ముంబై ఇండియన్స్‌ని విజయ తీరాలకు చేర్చాడు. కేవలం 35 బంతుల్లోనే 7 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో..
MI vs RCB: మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సూర్య 83 పరుగులతో తన విశ్వరూపం చూపించాడు. తన కెరీర్ అత్యుత్తమ స్కోర్ అందుకునే క్రమంలో అతను చెలరేగడమే కాక ముంబై ఇండియన్స్‌ని విజయ తీరాలకు చేర్చాడు. కేవలం 35 బంతుల్లోనే 7 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 83 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. ఇక సూర్య ఆడిన ఈ ఇన్సింగ్స్‌పై అటు మాజీలు, ఇటు వర్ధమాన హీరోలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మైదానంలో ఉండగానే ఆర్‌సీబీ టీమ్ ప్లేయర్ కింగ్ కోహ్లీ.. సూర్య ఇన్నింగ్స్‌కి కంగ్రాట్స్ చెబుతూ భుజం తట్టాడు. ఆ మ్యాచ్ అనంతరం టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ కూడా సూర్యను మెచ్చుకున్నాడు. ‘సూర్య కుమార్ యాదవ్ ప్రపంచంలోనే బెస్ట్ టీ20 ప్లేయర్. అతన్ని చూస్తుంటే కంప్యూటర్‌పై బ్యాటింగ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది’ అంటూ దాదా ట్వీట్ చేశాడు.
ఇంకా మ్యాచ్ తర్వాత సూర్య ఇన్నింగ్స్‌పై గవాస్కర్ కూడా స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడాడు. ‘ముంబై ఇండియన్స్ ‘స్కై’ ప్రత్యర్థి బౌలర్లతో ఆటాడుకున్నాడు. అతడు అలా బ్యాటింగ్ చేస్తుంటే.. గల్లీ క్రికెట్ ఆడుతున్నట్లే ఉంది. ప్రాక్టీస్, హార్డ్ వర్క్‌తో అతడు మరింత మెరుగయ్యాడు. అతని బాటమ్ హ్యాండ్ చాలా పవర్ ఫుల్ ఇంకా దాన్ని అతను చాలా పర్ఫెక్ట్‌గా ఉపయోగిస్తాడు. ఆర్సీబీతో అతడు మొదట లాంగాన్, లాంగాఫ్‌లవైపు ఆడటం మొదలుపెట్టి.. తర్వాత గ్రౌండ్ నలుమూలలా బౌండరీలు, సిక్స్ లు బాది నిజమైన మిస్టర్ 360 అనిపించుకున్నాడు’ అంటూ గవాస్కర్ చెప్పుకోచ్చాడు.
When Virat Kohli congratulated Surya for his brilliant innings ?
Good display of Sportsmanship ?#MIvRCB | #TATAIPL | #IPL2023pic.twitter.com/4h3073ScOV
— CricWatcher (@CricWatcher11) May 9, 2023
Surya Kumar yadav the best T20 player in the world .. it seems he bats on a computer .. @surya_14kumar @mipaltan
— Sourav Ganguly (@SGanguly99) May 9, 2023
సూర్యపై ప్రశంసలు అక్కడితో ఆగలేదు. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసీస్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ‘సూర్య బెస్ట్ బ్యాటర్లలో ఒకడు. అతను ఇలా చెలరేగుతుంటే అడ్డుకట్ట వేయడం చాలా కష్టమే’ అని చెప్పుకొచ్చాడు. అలాగే గుజరాత్ టైటాన్స్ బౌలర్ రషీద్ ఖాన్ కూడా సూర్యని పొగుడుతూ ట్వీట్ చేశాడు. రషిద్ తన ట్వీట్‌లో ‘స్కై నువ్వు టూ గుడ్ భాయ్.. ఇప్పుడు మా బౌలర్లు నీకు ఎలా బౌలింగ్ చేయాలి’ అంటూ రాసుకొచ్చాడు.
S K Y just tooooooooooo goood bhai where we bowlers bowle to you now ???????? @surya_14kumar
— Rashid Khan (@rashidkhan_19) May 9, 2023
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఈ క్రమంలో కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ 65, మ్యాక్స్‌వెల్ 68, దినేష్ కార్తిక్ 30 పరగులతో రాణించారు. ముంబై బౌలర్లలో బెహ్రండర్ఫ్ 3 వికెట్లతో చెలరేగగా, కామెరూన్ గ్రీన్, క్రిస్ జోర్డన్, కుమార్ కార్తికేయ తలో వికెట్ తీసుకున్నారు. అనంతరం 200 పరుగులు టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబైకి కెప్టెన్ రోహిత్ నుంచి సహకారం లభించకపోయినా ఇషాన్ కిషన్ 42, సూర్య కుమార్ యాదవ్ 83, నేహల్ వధేరా 52 పరుగులతో రాణించారు. అలా ముంబై గెలిచిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ తరఫున వనిందు హసరంగా, విజయ్‌కుమార్ వైశాక్ చెరో 2 వికెట్లు తీశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..