AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Tips: పొడవాటి జుట్టు కోసం హోమ్ రెమెడీస్.. ఫాల్లో అయ్యారంటే మెరిసే కేశాలు మీ సొంతం..

Hair Tips: మెరిసే పొడవాటి జుట్టును కోరుకోనివారు ఎవరుంటారు..? కానీ మారిన లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా జుట్టు సంరక్షణ పెద్ద సవాలుగా మారింది. తినే ఆహారంలో జుట్టు పోషణకు కావలసిన పోషకాలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు నిపుణులు. అయితే కొన్ని..

Hair Tips: పొడవాటి జుట్టు కోసం హోమ్ రెమెడీస్.. ఫాల్లో అయ్యారంటే మెరిసే కేశాలు మీ సొంతం..
Tips for Long Hair
శివలీల గోపి తుల్వా
|

Updated on: May 10, 2023 | 9:10 AM

Share

Hair Tips: మెరిసే పొడవాటి జుట్టును కోరుకోనివారు ఎవరుంటారు..? కానీ మారిన లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా జుట్టు సంరక్షణ పెద్ద సవాలుగా మారింది. తినే ఆహారంలో జుట్టు పోషణకు కావలసిన పోషకాలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు నిపుణులు. అయితే కొన్ని చిట్కాల ద్వారా జుట్టును మెరిసేలా చేసుకోవచ్చని వారు చెబుతున్నారు. ఈ క్రమంలోనే విటమిన్ సీ ఉన్న ఆహారాలను కూడా తీసుకోవాలని వారు చెబుతున్నారు. ఇంకా మెరిసే పొడవాటి జుట్టు కోసం వారు సూచిస్తున్న చిట్కాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

నారింజ తొక్క: నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇంకా నారింజ తొక్కలను ఉడికించిన నీటితో జుట్టును కడిగితే కేశ సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక జుట్టు ఆరోగ్యవంతంగా మెరిసిపోతుందని పేర్కొంటున్నారు.

ఉసిరి రసం: కేశ సంరక్షణలో ఉసిరి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఆయుర్వేద నిపుణుల ప్రకారం ఉసిరి అనేది ఔషధాల నిధి. ఇందులోని ఔషధ గుణాలు జుట్టు, చర్మానికి చాలా ఉపయోగకరంగా పని చేస్తాయి. విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున ఉసిరి రసాన్ని జుట్టుకు పట్టిస్తే, అది మూలాల నుంచి కూడా కేశాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఫలితంగా జుట్టును మెరిసేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

నిమ్మరసం: మెరిసే కేశాలను కోరుకునేవారు నిమ్మ రసాన్ని జుట్టుకు రాసుకుంటే అది సిల్కీగా, మృదువుగా తయారవుతుంది. అందుకోసం నిమ్మరసం, ఆవాల నూనె కలిపి జుట్టుకు అప్లై చేస్తే చాలు. అలా చేసి తేలికపాటి షాంపూతో తలస్నానం చేయండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..