AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: పెట్ కోసం గ్రాండ్‌ బర్త్‌డే పార్టీ.. కానీ పాటపై పిల్లికి కోపం.. వైరల్ అవుతున్న వీడియో..

చాలా మంది పెట్ లవర్స్‌కి వారి పెంపుడు జంతువులే తమ ప్రపంచం అన్నట్లుగా ఉంటుంది. తమ పెట్స్‌తో సాధ్యమైనంత ఎక్కువ సమయం కావాలని కోరుకుంటారు. వాటిని తమ బిడ్డలుగా లేదా తోబుట్టువులగా ట్రీట్ చేస్తారు. అంతేనా వాటికి ఏ చిన్న..

Watch Video: పెట్ కోసం గ్రాండ్‌ బర్త్‌డే పార్టీ.. కానీ పాటపై పిల్లికి కోపం.. వైరల్ అవుతున్న వీడియో..
Cat's Birthday
శివలీల గోపి తుల్వా
|

Updated on: May 08, 2023 | 8:05 PM

Share

చాలా మంది పెట్ లవర్స్‌కి వారి పెంపుడు జంతువులే తమ ప్రపంచం అన్నట్లుగా ఉంటుంది. తమ పెట్స్‌తో సాధ్యమైనంత ఎక్కువ సమయం కావాలని కోరుకుంటారు. వాటిని తమ బిడ్డలుగా లేదా తోబుట్టువులగా ట్రీట్ చేస్తారు. అంతేనా వాటికి ఏ చిన్న కష్టం వచ్చినా విలవిల్లాడిపోతారు. ఇలాంటి దృశ్యాలకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అయితే పెట్స్‌కి బర్త్‌డే జరిపిన ఘటనలు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి వీడియోనే ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. వీడియో వారికి బాగా నచ్చేయడంతో రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.

ఈ వీడియోలో ఓ పిల్లికి 14వ పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయి. అందుకోసం పిల్లి తల మీద క్యాప్, తినేందుకు బర్త్‌డే కేక్ వంటివి కూడా బాగానే ఏర్పాటు చేశారు. అయితే బర్త్‌డే సాంగ్ విషయంలో పెట్ ఓనర్స్ ఓ వినూత్న ప్రయత్నంచేశారు. మనకంటే ‘హ్యాప్పీ బర్త్‌డే టూ యూ’ అని పాడితే అర్థం అవుతుంది. కానీ పెట్స్‌కి ఆ పాట అర్థం అయినా కాకపోయినా.. వాటి నేటివ్ లాంగ్వేజ్‌లోనే పాట పాడాలని అనుకున్నారు సదరు పెట్ ఓనర్స్. అంతే.. పిల్లిలా బర్త్‌డే సాంగ్  ట్యూన్‌లో అరిచారు. అందుకు పిల్లి ఇచ్చిన హావభావాలు సరిగ్గా అర్థం కాకపోయినప్పటికీ కొంత కోపంలో ఉందేమో అనిపిస్తుంది. ఇక వీడియోలో పెట్ లవర్స్‌ని చూడలేనప్పటికీ వారి పాటను వినవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇక వీడియోలోని బర్త్‌డే వీడియోన చూసిన నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. వారికి తోచినట్లుగా తమ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ‘పిల్లికి ఈ పార్టీ నచ్చలేదు. కేక్ మీద తన వయసు తెలిసేలా నెంబర్స్ పెట్టడమే కాక అది మాకు చూపిస్తే దానికి కోపం రాకుండా ఏం వస్తుంది’ అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు. మరొకరు ‘ఎందుకో ఆ పిల్లికి ఈ పాట నచ్చలేదు. మీకు అర్థం కావడంలేదా..?’ అంటూ కామెంట్ చేశారు. ఇంకొకరైతే ‘పిల్లిలా మ్యావ్ మ్యావ్ అంటున్నారు. తమ భాషను అవమానిస్తున్నారనే దానికి కోపం వచ్చిందేమో..’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ‘ఏది ఏమైనా పిల్లి కోసం గ్రాండ్ పార్టీ ఇచ్చారు.. బాగుంది’ అని వేరొకరు రాసుకొచ్చారు ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు లక్షలాది సంఖ్యలో లైకులు, వీక్షణలు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..