- Telugu News Photo Gallery Spiritual photos If Planning for Spiritual Tour, You can visit most famous Brindavan and its beautiful temples
Spiritual Tour: శ్రీకృష్ణుడి ‘బృందావనం’లో తప్పక సందర్శించాల్సిన దేవాలయాలివే.. అద్భుత శిల్పకళాశైలి, పచ్చని తోటలు ఇంకెన్నో..
బృందావన్ దేవాలయం: చాలా మంది వేసవి ఎండలలో అనేక పర్యటనలను ప్లాన్ చేస్తుంటారు. వాటిలో కొన్ని ఆధ్యాత్మిక పర్యటనలు కూడా ఉంటాయి. మీరు కూడా ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాలనుకుంటే, శ్రీకృష్ణ పరమాత్ముడు నడియాడిన బృందావన్‌లో అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. ఈ వేసవిలో పర్యాటక సందర్శనం కోసం మీరు ఈ ఆలయాలను కూడా సందర్శించవచ్చు.
Updated on: May 10, 2023 | 6:53 AM

శ్రీమహా విష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణ పరమాత్ముడు ఆడి పాడిన బృందావనంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఆయన తన సోదరుడు బలరాముడితో, ఇంకా తన చిన్న నాటి సఖి రాధారాణితో కలిసి ఉన్న దేవాలయాలు కూడా ఉన్నాయి.

బంకే బిహారీ: బంకే బిహారీ దేవాలయం బృందావన్‌లోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ఇక్కడికి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ప్రజలు దర్శనం కోసం వస్తుంటారు. మీరు బృందావనం వెళుతున్నట్లయితే ఈ దేవాలయాన్ని తప్పక సందర్శించండి.

కృష్ణ బలరామ్ ఆలయం: ఈ కృష్ణ బలరామ్ ఆలయాన్ని ఇస్కాన్ దేవాలయం అని కూడా అంటారు. 1975లో నిర్మితమైన ఈ ఆలయం శ్రీకృష్ణుడు, ఆయన సోదరుడు బలరాముడికి అంకితం చేయబడింది. ఇక్కడ ఉన్న చిత్రాల కళాకృతిని మీరు ఎంతగానో ఇష్టపడతారు.

శ్రీ రంగ్జీ ఆలయం: 1851లో నిర్మించబడిన ఈ ఆలయం బృందావన్‌లోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటి. రంగనాథునికి అంకితం చేయబడింది ఈ శ్రీ రంగ్జీ ఆలయం. ఆలయంలో మీరు దక్షిణ, ఉత్తర శైలి నిర్మాణ సౌందర్యాన్ని ఆరాధించగలరు.

ప్రేమ్ మందిర్: బృందావన్‌లోని ప్రేమ్ మందిర్ దేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. తెల్లని పాలరాతితో నిర్మితమైన ఈ ఆలయం శ్రీ కృష్ణుడికి అంకితం చేయబడింది. మీరు ఇక్కడ గోవర్ధన్ పర్వత లీల, కృష్ణ లీల, ఇంకా శ్రీకృష్ణుడి బాల్యంలోని అనేక ఇతర విషయాలను చూసి ఆనందించగలరు.





























