Health Tips: తిన్న తర్వాత ఇలాంటి పనులు చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త..! వెంటనే ఆపేయండి..

మన అలవాట్లలో కూడా కొన్ని మన ఆరోగ్యానికి దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. ఆ అలవాట్ల వల్ల మన ఆరోగ్యాన్ని క్షిణించపజేస్తుంది. మనం తిన్న తర్వాత చేసే అనేక అలవాట్లు ఆరోగ్యానికి హానికరం. అందుకే భోజనం చేసిన వెంటనే చేయకూడని కొన్ని అలవాట్ల గురించి తెలుసుకుందాం.

Health Tips: తిన్న తర్వాత ఇలాంటి పనులు చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త..! వెంటనే ఆపేయండి..
Follow us

|

Updated on: May 10, 2023 | 7:30 AM

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పౌష్టికాహారం తప్పనిసరి. కోవిడ్ కాలం తర్వాత ప్రజలు తమ ఆరోగ్యంపై మరింత అవగాహన కలిగి ఉన్నారు. ఆరోగ్యంగా ఉండటానికి ప్రజలు హెల్తీ ఫుడ్‌ని మాత్రమే తీసుకుంటున్నారు. అంతేకాదు.. వారి దినచర్యలో వ్యాయామాన్ని కూడా భాగంగా చేసుకుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే ఇదొక్కటే సరిపోదు. మన అలవాట్లలో కూడా కొన్ని మన ఆరోగ్యానికి దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. ఆ అలవాట్ల వల్ల మన ఆరోగ్యాన్ని క్షిణించపజేస్తుంది. మనం తిన్న తర్వాత చేసే అనేక అలవాట్లు ఆరోగ్యానికి హానికరం. అందుకే భోజనం చేసిన వెంటనే చేయకూడని కొన్ని అలవాట్ల గురించి తెలుసుకుందాం.

టీ, కాఫీలు తాగొద్దు: తిన్న వెంటనే టీ, కాఫీలు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే భోజనం చేసిన తర్వాత టీ, కాఫీలు తాగడం ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే ఇది మీ ఆహారం నుండి పోషకాలను గ్రహించడాన్ని నిరోధిస్తుంది.

స్నానం చేయకూడదు: భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు. తిన్న తర్వాత స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత మారుతుంది. దీనితో పాటు జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది. ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు.

ఇవి కూడా చదవండి

నిద్రపోకండి: కొందరికి భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుంది. అదే సమయంలో కొంతమంది విశ్రాంతి కోసం భోజనం తర్వాత నిద్రపోతారు. అయితే, అలా చేయడం వల్ల మీ ఆరోగ్యానికి హాని కలుగుతుంది. తిన్న తర్వాత నిద్రపోవడం మీ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇది తీవ్రమైన గుండెల్లో మంటకు కూడా కారణం కావచ్చు.

వ్యాయామం చేయవద్దు: కొందరు తిన్న వెంటనే వ్యాయామం చేస్తుంటారు. ఈ అలవాటును వెంటనే మార్చుకోవాలి. మీరు తిన్న వెంటనే వ్యాయామం చేయడం వల్ల అజీర్ణం ఏర్పడుతుంది. ఇది వికారం, వాంతులు, కడుపు నొప్పి మొదలైన వాటికి కారణమవుతుంది.

పండ్లు తినవద్దు: భోజనం చేసిన వెంటనే పండ్లు తినకూడదు. భోజనం చేసిన వెంటనే పండ్లను తినడం వల్ల ఆహారం నుండి పోషకాలను శరీరం గ్రహించడాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల మన శరీరం అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ