శ్రీశైల మహాకుంభాభిషేక మహోత్సవానికి సీఎం జగన్ కి ప్రత్యేక ఆహ్వానం
కుంభాభిషేకం సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలల ఏర్పాట్లను పరిశీలించారు. మహాకుంభాభిషేక మహోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందిని, అధికారులను ఆదేశించారు. క్యూ లైన్లలో భక్తుల రద్దీకి అనుగుణంగా నిరంతరం మంచినీరు సరఫరా చేయాలని సూచించారు.
శ్రీశైలంలో జరగనున్న మహాకుంభాభిషేక మహోత్సవానికి సీఎం జగన్‌ను ఆహ్వానించారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీశైలం ఆలయ ఈవో లవన్న. శ్రీశైలంలో ఈ నెల 25 నుంచి 31 వరకు మహారుద్ర శతచండీ మహాకుంభాభిషేక మహోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలోనే తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో జగన్‌ను ప్రత్యేకంగా కలిసి మహాకుంభాభిషేక ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా.. ముఖ్యమంత్రి జగన్‌కు శ్రీశైల ఆలయ వేదపండితులు వేదాశీర్వచనాలు ఇచ్చారు.
శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి, ఆలయ ఈవో లవన్న, దేవస్థానం ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, దేవదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ.. స్వామివారి లడ్డూ ప్రసాదాలు, జ్ఞాపికను అందజేసి.. శేషవస్త్రాలతో సీఎం జగన్‌ను సత్కరించారు.
ఇక ఇప్పటికే.. శ్రీశైల ఆలయ ప్రాంగణంలో జరిగే మహాకుంభాభిషేక మహోత్సవాల ఏర్పాట్లపై దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి సమీక్షించారు. కుంభాభిషేకం సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలల ఏర్పాట్లను పరిశీలించారు. మహాకుంభాభిషేక మహోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందిని, అధికారులను ఆదేశించారు. క్యూ లైన్లలో భక్తుల రద్దీకి అనుగుణంగా నిరంతరం మంచినీరు సరఫరా చేయాలని సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..