Shraddha Walkar Case: ప్రేయసిని ముక్కలు ముక్కలు చేసిన క్రూరుడి కేసులో లేటెస్ట్ అప్‌డేట్ ఇదే…

అయితే పూనావాలా ఆరోపణలను ఖండించారు. విచారణను డిమాండ్ చేశారు. ఈ కేసు తదుపరి విచారణ కోసం జూన్ 1కి వాయిదా పడింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు జనవరి 24న 6,629 పేజీల చార్జిషీటును దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులు అఫ్తాబ్‌ను దోషిగా నిర్ధారించేందుకు కావాల్సిన అన్ని ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు.

Shraddha Walkar Case: ప్రేయసిని ముక్కలు ముక్కలు  చేసిన క్రూరుడి కేసులో లేటెస్ట్ అప్‌డేట్ ఇదే...
Shraddha Walkar F
Follow us

|

Updated on: May 09, 2023 | 12:44 PM

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఘటన ఇది. ప్రేమించిన ప్రియురాలిని ప్రేమ పేరుతో దారుణంగా చంపేసిన ఘటన ప్రతి ఒక్కరినీ భయపడేలా చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన శ్రద్ధవాకర్ హత్య కేసులో నేడు కోర్టులో విచారణ జరిగింది.  తన ప్రేయసి శ్రద్ధా వాకర్‌ను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికిన కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలాపై ఢిల్లీలోని సాకేత్ కోర్టు ఈ రోజు(మే9న) అభియోగాలు మోపింది. ఢిల్లీ పోలీసులు పూనావాలాపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 (హత్య), 201 (సాక్ష్యాలను నాశనం) కింద కేసు నమోదు చేశారు. పోలీసులు సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం కోర్టు దీనిని రూపొందించింది. అయితే పూనావాలా ఆరోపణలను ఖండించారు. విచారణను డిమాండ్ చేశారు. ఈ కేసు తదుపరి విచారణ కోసం జూన్ 1కి వాయిదా పడింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు జనవరి 24న 6,629 పేజీల చార్జిషీటును దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులు అఫ్తాబ్‌ను దోషిగా నిర్ధారించేందుకు కావాల్సిన అన్ని ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమిత్ ప్రసాద్ మానసిక వైద్యుడితో శ్రద్ధ మాట్లాడిన ఆడియో/వీడియో రికార్డింగ్‌ను కూడా కోర్టు ముందు ఉంచారు.

కాగా, శ్రద్ధా వాకర్ తండ్రి వికాస్ వాల్కర్ గత నెల చివర్లో కేసును త్వరగా విచారించాలని, తద్వారా తన కూతురి అంత్యక్రియలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఒక నెలలోపు పూర్తి చేయకపోతే నిరాహార దీక్ష చేస్తానని బెదిరించారు. సాంప్రదాయం, సంస్కృతికి అనుగుణంగా తన కుమార్తె అవశేషాలను కుటుంబానికి అంత్యక్రియల కోసం అప్పగించాలని న్యాయమూర్తిని కోరుతూ శ్రీ వాకర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

గతేడాది మే 18న శ్రద్ధాను పూనావాలా గొంతు నులిమి హత్య చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి, దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీలోని తన ఇంట్లో దాదాపు మూడు వారాల పాటు ఫ్రిజ్‌లో ఉంచి రాజధానిలోని వివిధ ప్రదేశాలలో వాటిని చెల్లాచెదురుగా పడేశాడు.

అఫ్తాబ్ నవంబర్ 12, 2022 నుండి కస్టడీలో ఉన్నాడు. ఢిల్లీ పోలీసులు పూనావాలాపై వచ్చిన ఆరోపణలను నిర్ధారించడానికి నార్కో-అనాలిసిస్ టెస్ట్, పాలిగ్రాఫ్ టెస్ట్, DNA ఆధారాలను సేకరించారు. 150 మందికి పైగా సాక్షులను విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేసినట్లు సమాచారం. పోలీసులు అతని వాయిస్ శాంపిల్‌ను కూడా సేకరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..