AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఇంట్లో వాడే ఫ్రిడ్జ్‌ వాసనతో విసుగెత్తిపోయారా..? ఈ సింపుల్‌ టిప్స్‌ ఫాలో అవ్వండి..

గాఢమైన వాసనలు దూరం చేసేందుకు ఫ్రిజ్‌లో కొన్ని నిమ్మకాయ ముక్కలు పెట్టాలి. ఫ్రిజ్‌ నుంచి వచ్చే ఒకరకమైన వాసనను వెనీలా ఎసెన్స్‌ పోగొడుతుంది. వెనీలా ఎసెన్స్ డ్రాప్స్ వేసిన కాటన్ బాల్స్‌ను ఫ్రిజ్‌లో పెడితే చాలు ఫ్రిజ్‌ నుంచి వచ్చే వాసన ఇట్టే మాయం అవుతుంది.

మీ ఇంట్లో వాడే ఫ్రిడ్జ్‌ వాసనతో విసుగెత్తిపోయారా..? ఈ సింపుల్‌ టిప్స్‌ ఫాలో అవ్వండి..
Freezer Smells So Bad
Jyothi Gadda
|

Updated on: May 09, 2023 | 11:15 AM

Share

ఫ్రీడ్జ్‌..ఇప్పుడు ప్రతి ఒకరి ఇంట్లో ఉండే సాధారణ గృహవినియోగ పరికరం. ఫ్రీజర్‌లో ఆహారాన్ని ఉంచడం వల్ల చాలా కాలం పాటు పాడవకుండా తాజాగా, సురక్షితంగా ఉంచవచ్చని చాలా మంది నమ్మకం. కొన్ని రోజులు, వారాలు, ఒక్కోసారి నెలల తరబడి కూడా ఆహారాలు, ఆహారం తయారీకి అవసరమైన పదార్థాలను ఉంచుతుంటారు. కానీ, మీ ఫ్రీజర్‌లో వింత వాసనను మీరు ఎప్పుడైనా గమనించారా? ఇది ఎక్కడ నుండి వస్తుంది..? సమస్యను పరిష్కరించడానికి ఏం చేయాలి? మీ ఫ్రీజర్ దుర్వాసన రావడానికి అనేక కారణాలలో కఠినమైన జెర్మ్స్, కఠినమైన రసాయనాలు ఉండవచ్చు. సాధారణంగా, సూక్ష్మజీవులు దీనికి కారణం. బ్యాక్టీరియా, ఈస్ట్‌ వంటివి. ఫ్రీజర్ సూక్ష్మజీవుల పెరుగుదలను అడ్డుకున్నప్పటికీ, ఉష్ణోగ్రత -18 °C (సిఫార్సు చేయబడిన ఫ్రీజర్ ఉష్ణోగ్రత) కంటే ఎక్కువగా పెరిగినప్పుడు కొన్ని ఇప్పటికీ వృద్ధి చెందుతాయి.

కొన్ని ఈజీ, సింపుల్ టిప్స్‌తో ఈ వాసనలకు చెక్ పెట్టవచ్చు..

ఫ్రిజ్‌ను పూర్తిగా నింపితే, దాని నుంచి దుర్వాసన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిగిలిపోయిన ఆహారాన్ని గాలి చొరబడని కంటైనర్లలో ప్యాక్ చేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. మిగిలిపోయిన ఆహారాన్ని గాలి చొరబడని కంటైనర్లలో ప్యాక్ చేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. లేదంటే ఆ ఫుడ్ ఫ్లేవర్ కారణంగా ఫ్రిజ్‌ నుంచి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. ఫ్రిజ్ ఇన్నర్ టెంపరేచర్‌ను ప్రొడక్ట్ గైడ్‌లైన్స్ ప్రకారం మెయింటెన్ చేయాలి. ఇన్నర్ టెంపరేచర్ 4-5 డిగ్రీలు ఉంటే దుర్వాసనకు కారణమయ్యే బాక్టీరియా నశిస్తుంది.

చాలా రోజులగా నిల్వ ఉన్న పదార్థాలను టైమ్‌కు ఫ్రిడ్జ్‌ నుంచి త్వరగా వాడేయాలి. లేదంటే బయటపరాబోయాలి.. కూరలు, దోస పిండి లాంటి ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్‌‌లో పెట్టినప్పుడు వాటి మీద మూతలు తప్పకుండా వెయ్యాలి. ముఖ్యంగా మసాల వేసిన ఆహార పదార్థాలకు మూతలు వేయడం మర్చిపోవద్దు. వాటి నుంచి వచ్చే ఘాటు వాసన ఫ్రిడ్జ్‌ మొత్తం వ్యాపిస్తుంది. వండిన పదర్థాలను ఒక ట్రేలో, వండని పదార్థాలను మరొక ట్రేలో పెట్టాలి. అలాగే పాలు, పెరుగు, నెయ్యి వంటివి సపరేట్‌గా పెట్టుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఒక గిన్నెలో బేకింగ్ సోడా వేసి ఫ్రిజ్‌లో పెడితే దుర్వాసన క్రమంగా పోతుంది. గాఢమైన వాసనలు దూరం చేసేందుకు ఫ్రిజ్‌లో కొన్ని నిమ్మకాయ ముక్కలు పెట్టాలి. ఫ్రిజ్‌ నుంచి వచ్చే ఒకరకమైన వాసనను వెనీలా ఎసెన్స్‌ పోగొడుతుంది. వెనీలా ఎసెన్స్ డ్రాప్స్ వేసిన కాటన్ బాల్స్‌ను ఫ్రిజ్‌లో పెడితే చాలు ఫ్రిజ్‌ నుంచి వచ్చే వాసన ఇట్టే మాయం అవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..