వేపపూలకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. రక్తశుద్ధికి, దేహంలోని మలినాలను తొలగించడానికీ వీటిని ఉపయోగిస్తారు. వేప పూలు చేదుగా ఉన్నా వాటితో చేసే రసం చాలా రుచికరంగా ఉంటుంది. వేసవిలో వికసించే వేప ఆకులు, పూలను సేకరించి భద్రపరచుకున్నట్టయితే వేప ఔషధ ప్రయోజనాలను ఏడాది పొడవునా పొందవచ్చు.