Madhya Pradesh: ఘోర ప్రమాదం.. వంతెనపై నుంచి పడిపోయిన బస్సు.. 15 మంది మృతి

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దాసంగా ప్రాంతంలో బస్సు అదుపుతప్పి బ్రిడ్జ్‌పై నుంచి కింద పడిపోయింది. ఈ దుర్ఘటనలో 15మంది ప్రాణాలు కోల్పోయారు. 25 మంది గాయాలపాలయ్యారు. చనిపోయివారిలో ఆరుగురు మహిళలు, ఆరుగురు పురుషులు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

Madhya Pradesh: ఘోర ప్రమాదం.. వంతెనపై నుంచి పడిపోయిన బస్సు.. 15 మంది మృతి
Bus Accident
Follow us
Aravind B

|

Updated on: May 09, 2023 | 12:17 PM

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దాసంగా ప్రాంతంలో బస్సు అదుపుతప్పి బ్రిడ్జ్‌పై నుంచి కింద పడిపోయింది. ఈ దుర్ఘటనలో 15మంది ప్రాణాలు కోల్పోయారు. 25 మంది గాయాలపాలయ్యారు. చనిపోయివారిలో ఆరుగురు మహిళలు, ఆరుగురు పురుషులు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయ 8.30 గంటలకు శ్రీఖండి నుంచి ఇండోర్‌కు బస్సు వెళ్తోంది. దాసంగా ప్రాంతం సమీపంలోని డొంగరగౌన్ బ్రిడ్జి పైకి రాగానే బస్సు అదుపు తప్పి కిందపడిపోయింది.

మృతుల్లో డ్రైవర్, కండక్టర్, క్లీనర్ కూడా ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ, కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే సహాయకచర్యలను పర్యవేక్షించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సు సామర్థ్యం కంటే ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటన జరిగిన అనంతరం మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ సర్కారు స్పందించింది. మృతుల కుటంబాలకు రూ.4 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించారు. అలాగా తీవ్రంగా గాయాలపాలైనవారికి రూ.50 వేలు.. స్వల్ప గాయాలైన వారికి రూ.25 వేలు ఇస్తామని తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్