Priyanka Gandhi: యువతే టార్గెట్‌గా కాంగ్రెస్ హామీలు.. హైదరాబాద్‌ యూత్‌ డిక్లరేషన్‌ వెలువరించిన ప్రియాంక గాంధీ..

అమరవీరుల త్యాగాలు వృధా కాకూడదని ప్రియాంకా గాంధీ అన్నారు. త్యాగాల గురించి తనకు, తన కుటుంబానికి తెలుసునని తెలిపారు. తెలంగాణ నేల అంటే ఇక్కడి ప్రజలకు తల్లితో సమానమని ప్రియాంక అన్నారు. 40 ఏళ్ల క్రితం చనిపోయిన తన నాన్నమ్మతో తనను పోల్చి తనపై పెద్ద బాధ్యతను తెలంగాణ ప్రజలు తనపై ఉంచారని ప్రియాంక భావోద్వేగానికి గురయ్యారు.

Priyanka Gandhi: యువతే టార్గెట్‌గా కాంగ్రెస్ హామీలు.. హైదరాబాద్‌ యూత్‌ డిక్లరేషన్‌ వెలువరించిన ప్రియాంక గాంధీ..
Priyanka Gandhi
Follow us

|

Updated on: May 08, 2023 | 8:59 PM

ఎన్నో ఆత్మత్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ఒక్క కల కూడా సాకారం కాలేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన యువసంఘర్షణ సభలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూత్‌ డిక్లరేషన్‌లో పేర్కొన్న విషయాలను ప్రియాంక ప్రకటించారు. దీని అమలు కోసం తామంతా జవాబుదారీగా ఉంటామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో ఈ హామీలు అమలు చేయకపోతే తమను గద్దె దింపాలని సూచించారు. కాంగ్రెస్‌ యువ సంఘర్షణ సభలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిప్పులు చెరిగారు ప్రియాంకాగాంధీ. తెలంగాణ కోసం వేలాదిమంది ప్రాణత్యాగం చేశారని , కాని తెలంగాణ ఆకాంక్షలు 9 ఏళ్ల తరువాత కూడా నెరవేరలేదన్నారు. ఇందిరాగాంధీతో పోల్చడం గర్వకారణంగా ఉందన్నారు ప్రియాంక. 40 ఏళ్ల తరువాత కూడా ఇందిరమ్మ పాలనను ప్రజలు గుర్తుకుతెచ్చుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని , ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్‌ ఆవిషయాన్ని మర్చిపోయారని మండిపడ్డారు ప్రియాంకాగాంధీ.

ముందుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలు విషయాలను ప్రస్తావించారు. యూత్‌ డిక్లరేషన్‌లో మొత్తం 17 హామీలు ఇచ్చింది కాంగ్రెస్‌. నిరుద్యోగ రహిత తెలంగాణ కోసం సెంట్రలైజ్డ్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌, ప్రైవేట్‌ కంపెనీల్లో తెలంగాణ యువతకు 75 శాతం రిజర్వేషన్‌, యువత కోసం యూత్‌ కమిషన్, 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు. గల్ఫ్‌ ఏజెంట్ల నియంత్రణ కోసం ప్రత్యేక గల్ఫ్‌ విభాగం ఏర్పాటు, ప్రత్యేక చట్టంతో TSPSC ప్రక్షాళన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఇంటిగ్రేటెడ్‌ వర్సిటీలుగా పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన యూనివర్సిటీలు, యూనివర్సిటీలు లేని జిల్లాల్లో కొత్త ఇంటిగ్రేటెడ్‌ వర్సీలు, బాసర ట్రిపుల్‌ ఐటీ తరహాలో తెలంగాణలో మరో 4 కొత్త ట్రిపుల్‌ ఐటీలు, పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం హైదరాబాద్‌, వరంగల్‌లో 2 యూనివర్సిటీలు, 18 సంవత్సరాలు పైబడి చదువుకునే యువతులకు ఉచితంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇలా అనేక హామీలు యూత్‌ డిక్లరేషన్‌లో ఉన్నాయి.

ఈ సందర్భంగా దాదాపు 25 నిమిషాల సేపు ప్రసగించిన ప్రియాంక మధ్యలో తెలుగులో కూడా కొన్ని మాటలు మాట్లాడారు. అమరవీరుల త్యాగాలు వృధా కాకూడదని ప్రియాంకా గాంధీ అన్నారు. త్యాగాల గురించి తనకు, తన కుటుంబానికి తెలుసునని తెలిపారు. తెలంగాణ నేల అంటే ఇక్కడి ప్రజలకు తల్లితో సమానమని ప్రియాంక అన్నారు. 40 ఏళ్ల క్రితం చనిపోయిన తన నాన్నమ్మతో తనను పోల్చి తనపై పెద్ద బాధ్యతను తెలంగాణ ప్రజలు తనపై ఉంచారని ప్రియాంక భావోద్వేగానికి గురయ్యారు. BRS ప్రభుత్వ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని అన్నారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రియాంకా అన్నారు. రోజుకు సగటున ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ ఇంటికీ ఉద్యోగమిస్తాని చెప్పిన కేసీఆర్‌ ఆ హామీ నిలబెట్టుకోలేదని తెలిపారు. నిరుద్యోగభృతి ఊసే లేదని అన్నారు. TSPSC పేపర్‌ లీక్‌ అయితే ఎటువంటి చర్య తీసుకోలేదని ఆరోపించారు. దాదాపు రెండు నెలలుగా పాదయాత్ర చేస్తున్న CLP నేత భట్టి విక్రమార్క తన యాత్రకు విరామమిచ్చిన యువ సంఘర్షణ సభకు హాజరయ్యారు. పాదయాత్ర సందర్భంగా పోచంపల్లిలో తీసుకున్న చేనేత చీరను ప్రియాంక గాంధీకి అందజేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..