TS ICET 2023 last date: తెలంగాణ ఐసెట్- 2023 దరఖాస్తు గడువు పెంపు.. ఆలస్య రుసుం లేకుండా అప్పటి వరకు అవకాశం
తెలంగాణ రాష్ట్రంలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించనున్న టీఎస్ ఐసెట్-2023 దరఖాస్తుల గడువు పెంపొదిస్తున్నట్లు ప్రకటించింది..
తెలంగాణ రాష్ట్రంలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించనున్న టీఎస్ ఐసెట్-2023 దరఖాస్తుల గడువు పెంపొదిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మే 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెల్పుతూ కన్వీనర్ పి వరలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 6కే గడువు ముగియగా విద్యార్థుల వినతుల మేరకు ఆలస్య రుసుం లేకుండా 12 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.
అభ్యర్థులు రూ.250 ఆలస్య రుసుంతో మే 15 వరకు, రూ.500తో 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మే 22 నుంచి హాల్‌టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. మే 26, 27 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 75 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఆన్‌లైన్‌లో జరగనున్నాయి. ఆన్సర్ కీ జూన్ 5న విడుదల అవుతుంది. జూన్ 20న ఫలితాలను విడుదల చేయనున్నారు.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.