Bank of Baroda Jobs 2023: బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్..
భారత ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా సీ అండ్ ఐసీ విభాగంలో.. రెగ్యులర్ ప్రాతిపదికన 157 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన..
భారత ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా సీ అండ్ ఐసీ విభాగంలో.. రెగ్యులర్ ప్రాతిపదికన 157 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమాలో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. సీఏ/సీఎఫ్‌ఏ/సీఎస్/సీఎమ్‌ఏ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తుదారుల వయసు ఏప్రిల్ 1, 2023వ తేదీ నాటికి 24 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో మే 17, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.69,180ల నుంచి రూ.89,890ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు..
- రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులు: 66
- క్రెడిట్ అనలిస్ట్ పోస్టులు: 74
- ఫోరెక్స్ అక్విజిషన్ అండ్ రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులు: 17
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.