Railway Jobs 2023: పదో తరగతి అర్హతతో రాత పరీక్షలేకుండా రైల్వే ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన బిలాస్‌పూర్‌లోని సౌత్‌ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే (ఎస్‌ఈసీఆర్‌) ఆధ్వర్యంలోని పర్సనల్‌ డిపార్ట్‌మెంట్‌, డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ పరిధిలో.. 548 ట్రేడ్‌ అప్రెంటిస్‌షిప్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

Railway Jobs 2023: పదో తరగతి అర్హతతో రాత పరీక్షలేకుండా రైల్వే ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
South East Central Railway
Follow us
Srilakshmi C

|

Updated on: May 08, 2023 | 8:40 PM

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన బిలాస్‌పూర్‌లోని సౌత్‌ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే (ఎస్‌ఈసీఆర్‌) ఆధ్వర్యంలోని పర్సనల్‌ డిపార్ట్‌మెంట్‌, డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ పరిధిలో.. 548 ట్రేడ్‌ అప్రెంటిస్‌షిప్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫిట్టర్‌, పెయింటర్‌, ప్లంబర్‌, మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌, టర్నర్‌, వైర్‌మ్యాన్‌, గ్యాస్‌కట్టర్‌, ఫొటోగ్రాఫర్‌, వెల్డర్, షీట్‌ మెటల్‌ వర్కర్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఏడాది కాలవ్యవధితో ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా పదో తరగతి కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికేట్‌ (ఐటీఐ) కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు జులై 1, 2023వ తేదీనాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 3, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌ మార్కుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్లో చెక్‌ చేసుకోవచ్చు.

కేటగిరి వారీగా ఖాళీల వివరాలు..

  • అన్‌ రిజర్వ్‌డ్‌: 215
  • ఈడబ్ల్యూఎస్‌: 59
  • ఓబీసీ: 148
  • ఎస్సీ: 85
  • ఎస్టీ: 41

నోటిఫికేషన్‌ కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.