- Telugu News Photo Gallery To Overcome Anemia add these food items to your healthy diet and get more health benefits
Anemia: రక్తహీనత నివారణ, నిరోధనకు తినాల్సిన ఆహారాలివే.. క్యాన్సర్, గుండె సమస్యలకు కూడా చెక్..
రక్తహీనత అనేది రక్తంలో హిమోగ్లోబిన్, ఎర్ర రక్త కణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు సంభవించే వ్యాధి. శరీరంలో ఐరన్ లోపం కారణంగా ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఫలితంగా శ్వాస తీసుకోవడంలో సమస్యలతో పాటు అలసట, కళ్లు తిరగడం వంటి సమస్యలు కలుగుతాయి. ఈ నేపథ్యంలో కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం ద్వారా సమస్యను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి రక్తహీనతను అధిగమించేందుకు తీసుకోవలసిన ఆహారాలేమిటో ఇప్పుడు చూద్దాం..
Updated on: May 08, 2023 | 7:02 PM

బీట్‌రూట్: రక్తహీనతను అధిగమించడంలో బీట్‌రూట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో పుష్కలంగా ఉన్న ఐరన్, కాపర్, ఫాస్పరస్, మెగ్నీషియం, విటమిన్లు బి1, బి2, బి6, బి12, సి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు బీట్‌రూట్‌ను జ్యూస్‌గా లేదా నేరుగా తీసుకోవచ్చు.

డ్రై నట్స్: పిస్తా, జీడిపప్పు, బాదం వంటివి గింజలు ఐరన్‌కి మంచి వనరులు. 100 గ్రాముల పిస్తాలో 3.9 మి.గ్రా ఐరన్, అదే పరిమాణంలోని జీడిపప్పులో 6.7 మి.గ్రా ఐరన్ ఉంటుంది. బాదంలో కూడా 100 గ్రాములకు 5.4 మి.గ్రా ఐరన్ ఉంటుంది. వీటిలో ఉన్న ఐరన్‌తో సహ పలు పోషకాలు రక్తహీనతను నిరోధిస్తాయి. అంతేకాక క్యాన్సర్. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు అధిక బరువును నివారిస్తాయి.

నువ్వులు: రక్తహీనతను అధిగమించేందుకు నువ్వులు కూడా ఉపకరిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే ఐరన్, కాపర్, జింక్, సెలీనియం, విటమిన్లు బి6, ఇ, ఫోలేట్ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.ఇంకా ఇవి ఐరన్ శోషణను ప్రోత్సహిస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

మొరింగ ఆకులు: మొరింగ లేదా మునగ ఆకులలో విటమిన్ ఎ, సి, మెగ్నీషియం,ఐరన్ ఉన్న కారణంగా ఇది రక్తహీనతను తగ్గించడానికి పనిచేస్తుంది. ఇంకా ఐ ఆకులు శరీరానికి తక్షణ శక్తిని అందించడానికి కూడా ఉపకరిస్తాయి. ఫలితంగా అలసట నుంచి దూరంగా ఉండవచ్చు.

ఎండు ద్రాక్ష: ఎండుద్రాక్ష కూడా రక్తహీనతను అధిగమించడంలో ఉపయోగకరంగా ఉంటాయి. ఇందులోని ఐరన్, మెగ్నీషియం, కాపర్, విటమిన్ ఎ, సి రక్తంలోని ఎర్ర రక్త కణాల వృద్ధిని ప్రోత్సహిస్తాయి. ఇంకా రోగనిరోధక శక్తి, ఇనుము శోషణను పెంచుతాయి.





























