Chardham Yatra: చార్‌ ధామ్‌ యాత్రికులరా తస్మాత్‌ జాగ్రత్త..! వాళ్లను నమ్మి మోసపోవద్దు.. బీ అలర్ట్‌..

ఆన్‌లైన్ మోసాలను నివారించేందుకు ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు రిజిస్టర్డ్ టూర్, ట్రావెల్ ఏజెన్సీల జాబితాను పర్యాటక శాఖ సైట్‌లో పొందుపరిచినట్టుగా తెలిపారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఇతర రద్దీ ప్రదేశాలలో ఈ జాబితా అందుబాటులో ఉంటుందని చెప్పారు.

Chardham Yatra: చార్‌ ధామ్‌ యాత్రికులరా తస్మాత్‌ జాగ్రత్త..! వాళ్లను నమ్మి మోసపోవద్దు.. బీ అలర్ట్‌..
Chardham Yatra
Follow us
Jyothi Gadda

|

Updated on: May 09, 2023 | 1:32 PM

ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్ర 2023 ప్రారంభమైన వెంటనే భక్తులు, పర్యాటకుల తాకిడి పెరిగింది. దేశంలోని అనేక రాష్ట్రాల నుండి యాత్రికులు ధామ్‌లను సందర్శించడానికి చేరుకుంటున్నారు. ఢిల్లీ-ఎన్‌సిఆర్, ఎంపీ, యుపి, దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి యాత్రికుల రద్దీ కొనసాగుతోంది. కానీ, కేదార్‌నాథ్-బద్రీనాథ్, గంగోత్రి సహా నాలుగు ధాముల్లో దర్శనం పేరుతో కొందరు దుండగులు దేశంలోని పలు రాష్ట్రాల యాత్రికులను దారుణంగా మోసం చేయడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేదార్‌నాథ్‌ హెలికాప్టర్‌ సర్వీస్‌ పేరుతో మోసం చేసిన ఘటన ఒకటి తెరపైకి వచ్చింది.

కేదార్‌నాథ్ దర్శనం, చార్ ధామ్ యాత్ర టిక్కెట్ల పేరుతో మధ్యప్రదేశ్‌కు చెందిన 30 మంది భక్తుల నుంచి రూ.1.44 లక్షలు మోసం చేశారు కొందరు కంత్రీగాళ్లు. కేదార్‌నాథ్, చార్ ధామ్ యాత్రకు హెలికాప్టర్ టూర్ టిక్కెట్ల పేరుతో 30 మంది వృద్ధ భక్తులను ఆన్‌లైన్‌లో మోసం చేశారు కేటుగాళ్లు. ఈ మేరకు మధ్యప్రదేశ్‌లోని పాట్నీ నుండి వచ్చిన బృందం అధిపతి హర్బన్ష్ విశ్వకర్మ మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు…

హరిద్వార్ ఎగువ రహదారిలో ఉన్న ట్రావెల్ ఏజెన్సీ నుండి 30 మందికి హెలికాప్టర్ టిక్కెట్లు లభించాయని చెప్పారు. దీని కోసం మే 11 టిక్కెట్లను కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. కొంత మొత్తం ఇచ్చిన తర్వాత, ట్రావెల్ ఏజెంట్ చార్‌ధామ్ యాత్ర సమయంలో బస్సు, హోటల్ వంటి ఇతర సౌకర్యాలు కల్పిస్తామని నమ్మించాడు. ఆ తర్వాత ఏజెంట్‌కు అడ్వాన్స్‌గా 1.44 లక్షలు ఇచ్చారు. హరిద్వార్ చేరుకున్న తర్వాత ఏజెంట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అందించిన టిక్కెట్లు నకిలీవని తేలింది. దీంతో నకిలీ ట్రావెల్ ఏజెన్సీ పేరుతో చార్ధామ్ యాత్రకు వాహనాలు ఇప్పిస్తానని బెంగాల్, మధ్యప్రదేశ్ భక్తుల నుంచి లక్షా నలభై వేలు మోసం చేసిన ఉదంతం తెరపైకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఈ ఘటన తర్వాత అక్రమంగా నడుస్తున్న ముప్పై ట్రావెల్ ఏజెన్సీలకు రవాణా శాఖ బృందం నోటీసులు జారీ చేసింది. నలభై వేల మోసం చేసినట్లు ఫిర్యాదు అందిందని ఆర్టీవో రష్మీ పంత్ తెలిపారు. కాగా లక్ష రూపాయల మోసం జరిగినట్లు ట్రావెల్‌తో సంబంధం ఉన్న వ్యాపారులు తెలిపారు.

ARTO రష్మీ పంత్ సైబర్ మోసాలను నివారించడానికి ప్రయాణికులు స్వయంగా తెలుసుకోవాలని చెప్పారు. ఆన్‌లైన్ మోసాలను నివారించేందుకు ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు రిజిస్టర్డ్ టూర్, ట్రావెల్ ఏజెన్సీల జాబితాను పర్యాటక శాఖ సైట్‌లో పొందుపరిచినట్టుగా తెలిపారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఇతర రద్దీ ప్రదేశాలలో ఈ జాబితా అందుబాటులో ఉంటుందని తెలిపారు.

చార్‌ధామ్ యాత్రిస్‌తో ఆన్‌లైన్ మోసం దేవభూమి ప్రతిష్టను ప్రభావితం చేస్తోందని హరిద్వార్ ట్రావెల్ అసోసియేషన్ సైబర్ సెల్ జనరల్ సెక్రటరీ సుమిత్ శ్రీకుంజ్ అన్నారు. చార్ధామ్ యాత్రకు ప్రత్యేక సైబర్ సెల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని చెప్పారు. తద్వారా ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట వేసి దేవభూమి పేరు చెడగొట్టకూడదని కోరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..