AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే న్యూస్.. ఇక నుంచి నేరుగా వెళ్లొచ్చు.. తగ్గనున్న ప్రయాణం

తిరుమల శ్రీవారి భక్తులకు రిలీఫ్. తిరుమలకు వచ్చే భక్తులు శ్రీవారి దర్శనం అయిన తర్వాత వేరే ఆధ్యాత్మిక ప్రదేశాలను కూాడా దర్శించుకుంటారు. తిరుపతి నుంచి నేరుగా అలాంటి ప్రదేశాలకు వెళ్లేందుకు విమాన సర్వీసులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే న్యూస్.. ఇక నుంచి నేరుగా వెళ్లొచ్చు.. తగ్గనున్న ప్రయాణం
Tirumala
Venkatrao Lella
|

Updated on: Feb 22, 2026 | 5:09 PM

Share

తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని నిత్యం లక్షలాది మంది దర్శించుకుంటూ ఉంటారు. ఎప్పుడూ భక్తులతో శ్రీవారి ఆలయం, మాడవీధులు కళకళలాడుతూ ఉంటాయి. కొండపైకి శ్రీవారి దర్శనం కోసం లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఇక తిరుపతికి బస్సు, రైలు, విమాన మర్గాల ద్వారా దేశంలోని నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. తిరుపతికి చేరుకున్న ఇక్కడ నుంచి బస్సులు,  వెహికల్స్ ద్వారా రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుంటారు. ఇప్పటికే తిరుపతికి అనేక రైళ్లు నడస్తోండగా.. విమాన సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇక ఇక్కడ నుంచి బస్సులు వివిధ నగరాలకు సర్వీసులు అందిస్తున్నాయి. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి భక్తుల కోసం మరిన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. రానున్న రోజుల్లో వీటిని ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.

తిరుపతి నుంచే నేరుగా

ఆదివారం మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌తో కలిసి శ్రీకాళహస్తిని రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు రామ్మోహన్ నాయుడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తిరుపతి నుంచి దేశంలోని వివిధ ఆధ్యాత్మిక ప్రదేశాలకు భక్తులు నేరుగా వెళ్లేలా విమాన సర్వీసులను త్వరలో ప్రవేశపెడతామని అన్నారు. ఇక్కడ నుంచి గల్ప్ దేశాలకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉందని, దీంతో విదేశీ విమాన సర్వీసులు రేణిగుంటకు వచ్చేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రేణిగుంట నుంచి గల్ప్ దేశాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విమానయానశాఖకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు.

తిరుమల శ్రీవారి భక్తులకు ఊరట

తిరుమలను దర్శించుకున్న తర్వాత భక్తులు వేరే ఆధ్యాత్మిక ప్రదేశాలను కూడా దర్శించుకుంటూ ఉంటారు. ప్రముఖ ప్రదేశాలకు విమాన సర్వీసులు నేరుగా అందుబాటులోకి రావడం వల్ల తక్కువ సమయంలో ఆయా ప్రాంతాలకు చేరుకోవచ్చు. దీని వల్ల ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని చెప్పవచ్చు.

Follow Us