Airtel OTT Plans: ఎయిర్‌టెల్ యూజర్లకు ధమాకా ఆఫర్.. ఈ ప్లాన్స్‌తో ఓటీటీ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్.. మరెన్నో అదనపు ప్రయోజనాలు..

Airtel OTT Plans: ఎయిర్టెల్ తన యూజర్లకు ఇంటర్నెట్ డేటా, కాలింగ్ వంటి సేవలతో పాటు ఓటీటీ, మ్యూజిక్ యాప్స్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ వంటి అదనపు లాభాలు అందించేలా కొన్ని రకాల బెస్ట్ ప్లాన్స్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్స్ ద్వారా ఎయిర్‌టెల్ యూజర్స్ 5జీ..

Airtel OTT Plans: ఎయిర్‌టెల్ యూజర్లకు ధమాకా ఆఫర్.. ఈ ప్లాన్స్‌తో ఓటీటీ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్.. మరెన్నో అదనపు ప్రయోజనాలు..
Airtel Annual Plans
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 08, 2023 | 9:50 PM

Airtel OTT Plans: ఎయిర్టెల్ తన యూజర్లకు ఇంటర్నెట్ డేటా, కాలింగ్ వంటి సేవలతో పాటు ఓటీటీ, మ్యూజిక్ యాప్స్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ వంటి అదనపు లాభాలు అందించేలా కొన్ని రకాల బెస్ట్ ప్లాన్స్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్స్ ద్వారా ఎయిర్‌టెల్ యూజర్స్ 5జీ నెట్‌వర్క్ డేటా సేవలను అనందించవచ్చు. మరి యూజర్ల కోసం ఎయిర్టెల్ అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్ ఏమిటో ఇప్పుడే చూసేద్దాం..

ఎయిర్టెల్ రూ. 699 ప్లాన్

ఎయిర్టెల్ రూ. 699 ప్లాన్ యూజర్లకు ఆల్ రౌండ్ ప్రయోజాలను అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీతో పాటు Amazon Prime Video సబ్ స్క్రిప్షన్, డైలీ 3GB 4G డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100SMS వంటి అదనపు ప్రయోజనాలను అందుకుంటారు. ఇంకా ఈ ప్లాన్ తో Xtream APP యాక్సెస్, Wynk Music, 3 నెలల అపోలో 24/7, ఫాస్ట్ ట్యాగ్ పైన రూ. 100 క్యాష్ బ్యాక్‌ను కూడా పొందుతారు.

ఇవి కూడా చదవండి

ఎయిర్టెల్ రూ. 839, రూ. 999 ప్లాన్స్

ఎయిర్‌టెల్ అందిస్తున్న రూ. రూ. 839, రూ. 999 ప్లాన్స్ ద్వారా కూడా యూజర్లు ఆల్ రౌండ్ లాభాలను పొందగలరు. 84 రోజుల వ్యాలిడిటీతో వస్తున్న రూ. 839 ప్లాన్ ద్వారా డైలీ 2GB 4G డేటా 3నెలల Disney+ Hotstar మొబైల్ సబ్ స్క్రిప్షన్.. అలాగే రూ. 999 ప్లాన్ 3GB 4G డేటాని Amazon Prime Video సబ్ స్క్రిప్షన్ పొందగలరు. ఈ రెండు ప్లాన్స్ ద్వారా అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100SMS వినియోగం, Xtream APP యాక్సెస్, Wynk Music, 3 నెలల అపోలో 24/7, ఫాస్ట్ ట్యాగ్ పైన రూ. 100 క్యాష్ బ్యాక్ వంటి ఇతర ప్రయోజనాలను కూడా మీ సొంతం చేసుకోవచ్చు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..