Andhra Pradesh: భగ్గుమంటున్న భానుడు.. ఇప్పటికే 41 డిగ్రీలు దాటిన ఉష్టోగ్రతలు.. ఆ మండలాల్లో ఇంకా పెరిగే అవకాశం..

మే నెల ప్రారంభమైన కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భానుడి ప్రతాపం మళ్లీ ఎక్కువయింది. సోమవారం అనకాపల్లి  జిల్లా కె.కోటపాడులో అత్యధికంగా 41.5° C, కసింకోటలో 41° C ఉష్ణోగ్రత నమోదైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ క్రమంలోనే..

Andhra Pradesh: భగ్గుమంటున్న భానుడు.. ఇప్పటికే 41 డిగ్రీలు దాటిన ఉష్టోగ్రతలు.. ఆ మండలాల్లో ఇంకా పెరిగే అవకాశం..
High Temperatures in AP
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 08, 2023 | 6:25 PM

మే నెల ప్రారంభమైన కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భానుడి ప్రతాపం మళ్లీ ఎక్కువయింది. సోమవారం అనకాపల్లి  జిల్లా కె.కోటపాడులో అత్యధికంగా 41.5° C, కసింకోటలో 41° C ఉష్ణోగ్రత నమోదైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 11 మండలాల్లో రేపు, 17 మండలాల్లో బుధవారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అనకాపల్లి జిల్లాలలోని 11 మండలాలలో రేపు అధిక ఉష్ణోగ్రత, వేడగాల్పులు వీచే అవకాశం.

అంతేకాక అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 మండలాలు, అనకాపల్లిలో 4, కాకినాడ జిల్లాలో 4 మండలాలలో బుధవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో బయటకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..