మణిపూర్‌లోని తెలంగాణ విద్యార్థుల కోసం ప్రత్యేక విమానం.. స్పెషల్ హెల్ప్‌లైన్ ఏర్పాటు.. పూర్తి వివరాలివే..

Manipur Violence: ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్(ATSUM) నేతృత్వంలో జరిగిన ర్యాలి హింసాత్మకంగా మారినప్పటి నుంచి మణిపూర్‌ అట్టుడుకుతున్నది. ఇప్పటికే ప్రభుత్వం 5 రోజుల పాటు ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేసింది. మరోవైపు రాష్ట్రంలోని..

మణిపూర్‌లోని తెలంగాణ విద్యార్థుల కోసం ప్రత్యేక విమానం.. స్పెషల్ హెల్ప్‌లైన్ ఏర్పాటు.. పూర్తి వివరాలివే..
Kcr Govt To Send Aircraft To Manipur For Ts Students
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 07, 2023 | 3:17 PM

Manipur Violence: ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్(ATSUM) నేతృత్వంలో జరిగిన ర్యాలి హింసాత్మకంగా మారినప్పటి నుంచి మణిపూర్‌ అట్టుడుకుతున్నది. ఇప్పటికే ప్రభుత్వం 5 రోజుల పాటు ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేసింది. మరోవైపు రాష్ట్రంలోని హింసాత్మక ఘటనలను నివారించేందుకు అక్కడి ప్రభుత్వం పారామిలటరీ బలగాలను సైతం మోహరించింది. అలాగే అల్లర్లను, ఘర్షణలను కట్టడి చేసేందుకు కనిపిస్తే కాల్చివేయమని గవర్నర్‌ ఆదేశించారు. ఈ క్రమంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆందోళనకర పరిస్థితులు మణిపూర్‌లో నెలకొన్నాయి. ఇదిలా ఉండగా మణిపూర్‌లోని హింసాత్మక ఘటనల నేపథ్యంలో తెలంగాణ విద్యార్థులు సైతం బిక్కుబిక్కుమంటూ నెట్టుకువస్తున్నారు. ఇంఫాల్‌ నీట్‌ సహా పలు విద్యాసంస్థల్లో తెలంగాణ విద్యార్థులు విద్యాభ్యాసం కొనసాగుతున్నారు.

ప్రస్తుతం మణిపూర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులంతా గదులకే పరిమితమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో వారంతా తినేందుకు తిండి సైతం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా తల్లిదండ్రులు తమ పిల్లల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మణిపూర్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.  మణిపూర్‌లో తెలంగాణకు చెందిన 250 మంది విద్యార్థులను విమానం ద్వారా రాష్ట్రానికి తరలించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఇంఫాల్‌ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాన్ని విద్యార్థులను తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు తెలంగాణ సీఎస్‌ శాంతికుమారి మణిపూర్‌ సీఎస్‌తో మాట్లాడారు.

ఇవి కూడా చదవండి

ఇంకా మణిపూర్‌ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌ సమన్వయం చేస్తూ వస్తున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు విమానం ఇంఫాల్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానం రానున్నట్లుగా తెలుస్తున్నది. మరో వైపు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. హెల్ప్‌లైన్‌ ఇన్‌చార్జిగా డీఐజీ సుమతిని నియమించినట్లు డీజీపీ తెలిపారు. మణిపూర్‌ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ మన పౌరులను ఇక్కడికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. అవసరమున్న వారు హెల్ప్‌లైన్‌ 7901643283 నంబర్‌కు, లేదంటే.. dgp@tspolice.gov.inకు మెయిల్‌ ద్వారానైనా సంప్రదింవచ్చన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..